నాట్యమార్గం ప్రొడక్షన్స్ బ్యానర్ పై శివ బట్టిప్రోలు సమర్పణలో ఇంద్రాణి ధవళూరి నిర్మాతగా దర్శకురాలిగా తెరకెక్కించిన చిత్రం అందెల రవమిది. ఈ చిత్రానికి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తెలుగు సినిమా ప్రముఖుల మధ్య ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో దర్శకురాలు ఇంద్రాణి దవళూరి మాట్లాడుతూ.. ఇలాంటి ఒక గొప్ప సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు. తెలుగులో వచ్చిన ఎన్నో అద్భుతమైన సినిమాలు ముఖ్యంగా స్వర్ణకమలం సినిమా ఎంతో ప్రత్యేకం అని, ఆ సినిమా నుంచి ఎంతో స్పూర్తి పొందినట్లు చెప్పారు. విశ్వానాథ్ గారి సినిమాలు కూడా ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. ఈ సినిమా ఇంత బాగా రావడానికి ఎంతో మంది కృషి ఉంది అని పేర్కొన్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది తనకు ఇన్సిపిరేషన్ అని చెప్పారు. తెలుగు సినిమా నిర్మాత కేఎస్ రామారావు, దాముగారు లాంటి పెద్దలు ఈ సినిమాను ప్రొత్సహించడానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే సినిమా పాటలు ఆదిత్య మ్యూజిక్ లో ప్లే అవుతున్నాయని, ఈ సందర్భంగా ఆదిత్య మ్యూజిక్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.
కేఎస్ రామారావు గారు మాట్లాడుతూ... ఇంద్రాణి ధైర్యాన్ని మెచ్చుకోవాలి, ఇలాంటి క్లాసికల్ టైటిల్ తో ఈ రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చినందుకు అని చెప్పారు. ఒక గొప్ప ఆర్ట్ సినిమాను తీయడమే కాకుండా ఇంద్రాణి గారే నిర్మాత, దర్శకురాలు, లీడ్ యాక్టర్ కావడం సంతోషం అని చెప్పారు. అలాగే ఈ సినిమాలో మ్యూజిక్ అలాగే పాటలు కూడా చాలా బాగున్నాయి అన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా పూర్తిగా కమర్శియల్ గా మారిపోయిందని, ఇలాంటి సమయంలో సాప్రదాయ సంగీతం, నాట్యంతో మళ్లీ ఇండస్ట్రీకి ప్రాణం పోయడానికి అమెరికా నుంచి వచ్చారు అని కొనియాడారు. అలాగే ట్రైలర్ చూస్తే.. డ్యాన్స్ మాత్రమే కాదు నటన కూడా చాలా బాగుంది అన్నారు. ఈ సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిమీద ఉందన్నారు.
నిజమైన ఫ్యాషన్ అంటే ఇదే అని దాము ప్రసాద్ గారు అన్నారు. చాలామంది ఇండస్ట్రీకి ఎందుకు వస్తున్నారు అంటే ప్యాషన్ అంటారు కానీ ఇంద్రాణి ఫ్యాషన్ అంటే ఏంటో చూపించారు. ఒక సినిమాని హార్ట్ ఫామ్ లో తీయడం ఉంటే మామూలు విషయం కాదు అందులోనూ నాట్యం అనే ఆటో ఫార్ములా ఎంచుకొని ఇంత చక్కగా ఒక సినిమాను ప్రేక్షకులకు అందించిన ఇంద్రానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తారు. అందెల రవమిది సినిమా కోసం ఇంద్రాణి ఎంత కష్టపడిందో అంతే ఇష్టపడి చేసింది అన్నారు ఇలాంటి సినిమా ఈ రోజుల్లో వస్తుంది అని ఎవరు అనుకోరు కానీ ఇది కచ్చితంగా ప్రజలకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాను కచ్చితంగా ఈ సినిమా కోసం అందరూ చాలా మనసుపెట్టి చేశారు ప్రతి ఒక్కరికి సినిమా చేరువవుతుంది అని అన్నారు.
అందెల రవమిది సినిమా, ఈ టైటిల్ పోస్టర్ చూస్తుంటే సాగరసంగమం సినిమా గుర్తుకు వస్తుందని యూఎఫ్ఓ లక్ష్మణ్ అన్నారు. ఆ ఇన్సిపిరేషన్ తో చిన్నప్పుడు కొన్ని రోజులు డ్యాన్స్ నేర్చుకున్నట్లు తెలిపారు. ఇక ఈ సినిమా గురించి మాట్లాడితే.. ఇప్పటి వరకు 11 అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది అన్నారు. అలాగే బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా రానుందని తెలిపారు. సినిమాను తెలుగులో రిలీజ్ చేద్దామని అనుకున్నప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తారు. డిస్ట్రిబ్యూటర్స్ ఎలా అనుకున్నామని, కానీ ఈ రోజు చాలామంది ఇండస్ట్రి పెద్దలు సపోర్ట్ ఇస్తున్నారని తెలిపారు. ఇక సినిమా కచ్చితంగా మంచి ఆదరణ పొందుతుంది అని లక్ష్మణ్ చెప్పారు.
ఈస్ట్ వెస్ట్ అధినేత రాజీవ్ మాట్లాడుతూ.. ఈ సినిమా ఎంతో ప్రత్యేకం అన్నారు. ఈ రోజుల్లో ఇలాంటి సినిమా అంటే మాములు విషయం కాదు అంతే కాదు ఇంద్రాణి గారు తన చిన్నతనం అంటే 8 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు 1000కి పైగా డ్యాన్స్ ఫర్ఫార్మెన్సులు ఇచ్చారు అని చెప్పారు. అలాగే అమెరికాలో డ్యాన్స్ స్కూల్ ఏర్పాటు చేయడం, అక్కడ స్టూడెంట్స్ ను తయారు చేయడం గ్రేట్ అని చెప్పారు. అలాగే ఈ సినిమా అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులు గెలుచుకుంది అని చెప్పారు. సెప్టెంబర్ 19 న థియేటర్లోకి వస్తుందని చెప్పారు. ఓటీటీలో 1800 సినిమాలు చేసినట్లు చెప్పారు. సినిమాను ప్రోత్సహించాలని కోరారు.
సినిమా పేరు: అందెల రవమిది
నటీనటులు: ఇంద్రాణి దావలూరి, విక్రమ్ కొల్లూరు, తనికెళ్ల భరణి, ఆదిత్య మీనన్, జయలలిత, ఆది లోకేష్, నిర్మల తదితరులు
నిర్మాత & దర్శకుడు: ఇంద్రాణి దావలూరి
బ్యానర్ : నాట్యమార్గం ప్రొడక్షన్స్
డిఓపి: ఎస్కే భూపతి, హర్ష్ మహదీశ్వర్
ఎడిటర్: ఆవుల వెంకటేష్
సంగీతం: కార్తీక్ కొడకండ్ల
కొరియోగ్రఫీ: స్వర్ణ మాస్టర్, ఇంద్రాణి దావలూరి
స్క్రీన్ ప్లే: వేణు నక్షత్రం, గంటా రామ్ మోహనరావు, సాయిరామ్ పల్లె
పోస్ట్ ప్రొడక్షన్: డిజిపోస్ట్-యు.కళ్యాణ్ చక్రవర్తి, డి.రఘు వర్మ
పబ్లిసిటీ డిజైన్లు: అనిల్ & భాను
కథ: వేణు నక్షత్రం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సురేష్ ఉత్తారాది
కో-డైరెక్టర్: సాయిరామ్ పల్లె
0 Comments