ప్రేక్షకులు మెచ్చిన
"మిస్టరీ "తెలుగు సినిమా
తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వం చేస్తూ నటించిన కామెడీ థ్రిల్లర్ సినిమా "మిస్టరీ".PV ఆర్ట్స్ పతాకంపై వెంకట్ పులగం నిర్మాత చేసిన ఈ సినిమా
సంక్రాంతి పండుగ రోజు నుండి టాలీవుడ్ టైమ్స్ అనే యూట్యూబ్ ఛానెల్ లో
ఫ్రీ స్ట్రీమింగ్ చేశారు.
తనికెళ్ళ భరణి, అలీ, సుమన్, తల్లాడ సాయికృష్ణ, స్వప్న చౌదరి, వెంకట్ దుగ్గిరెడ్డి , రవి రెడ్డి, సత్య శ్రీ, ఆకెళ్ల, గడ్డం నవీన్, శోభన్ బొగరాజు,
ఎం.ఎస్ నాయుడు , లు ఇలా ప్రముఖ తారాగణం తో తెరకెక్కిన ఈ సినీమా థియేటర్లలో విడుదలైన చాలా రోజుల తరువాత
టాలీవుడ్ టైమ్స్ అనే యూట్యూబ్ ద్వారా స్ట్రీమింగ్ అవుతున్నట్లు డైరెక్టర్ తల్లాడ సాయి కృష్ణ తెలిపారు.
ఒక మర్డర్ జరగడం, అసలు ఎలా ఆ క్రైం జరిగిందీ అనే కోణం లో సినిమా మొదలు అవుతుంది.
కామెడీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో మంచి స్క్రీన్ ప్లే తో సినిమా సాగుతోంది.
మల్టీ లినియర్ స్క్రీన్ ప్లే ని ఈ సినిమా కి ఉపయోగించారు.మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా కి సంగీతం అందించిన పవన్ ఈ సినిమా కి బ్యాక్రౌండ్ సంగీతం అందించారు.
సినిమా
చివర వరకు ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ పొందుతారు.
1 గంట 50 నిమిషాలు నిడివిగల ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా రోజున విడుదల చేసిన ఈ సినిమా రోజు రోజు కి ప్రేక్షకుల ఆదరణ పొందుతూ సుమారు 50 వేల వ్యూస్ కి దగ్గరలో ఉన్నట్లు, అలానే
డీజిటల్ ప్లాట్ ఫామ్ లో ఫ్రీ గా చూసే విదంగా ఉన్నందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారని, మంచి కంటెంట్ కి ప్రేక్షకులు ఎల్లప్పుడూ తోడు గా నిలపడతారు అని అన్నారు.
రచన - శివ కాకు, కెమెరా - సుధాకర్ అక్కినేపల్లి, సంగీతం- రామ్ తవ్వ, పవన్, నిర్మాత - వెంకట్ పులగం, దర్శకత్వం- తల్లాడ సాయి కృష్ణ.
0 Comments