బీజేపీలో విషపురుగులా తయారైన భానుప్రకాష్ రెడ్డి..

బీజేపీలో విషపురుగులా తయారైన భానుప్రకాష్ రెడ్డి.. 

తులసివనంలో గంజాయి మొక్క లాగా విలువలతో కూడిన బీజేపీలో విషపురుగులాగా భానుప్రకాష్ రెడ్డి తయారయ్యారని తిరుపతి వాసులు అభిప్రాయపడుతున్నారు. ఆయన వల్లే టీటీడీ నుంచి తిరుపతికి రావాల్సిన ఒక శాతం నిధులు ఆగిపోయాయని మండిపడుతున్నారు. పచ్చ చొక్కా తొడుక్కుని కాషాయం ముసుగులో భానుప్రకాష్ చేస్తున్న అక్రమాలు,మోసాలపై ధ్వజమెత్తతున్నారు. సంచలనాల కోసం టీటీడీని టార్గెట్ చేయడం, అసత్య ఆరోపణలు చేయడం ఈయనకి పరిపాటిగా మారిందంటున్నారు. ఆయన పాలకమండలి సభ్యుడిగా ఉన్న సమయంలో తిరుపతిలోని ఒక్క ప్రముఖ హోటల్ వారికి దర్శనం టికెట్లను డబ్బులకు అమ్ముకుంది నిజం కాదా? అందుకు కోట్ల రూపాయలు తీసుకుంది వాస్తవం కాదా? అని ప్రశ్నిస్తున్నారు. నిత్యం దర్శనాలు, పైరవీల కోసం తిరిగే భానుప్రకాష్ తిరుపతి అభివృద్ధికి ఏం చేశావో చెప్పాలి..?అని నిలదీస్తున్నారు. 

భానుప్రకాష్ రెడ్డికి తిరుపతి ప్రజల సూటి ప్రశ్నలు..

తిరుపతికి ప్రముఖలు వచ్చినప్పుడు ఇడ్లీ, దోశలు అక్కడ బాగుంటాయి.. ఇక్కడ బాగుంటాయి.. అని తిప్పుతావే.. కానీ తిరుపతి అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం కోసం ఏ రోజైనా ప్రయత్నం చేశావా..?

ప్రముఖులు విమానాశ్రయంలో దిగింది మొదలు.. వారికి దగ్గరుండి దర్శనం చేయించి.. వారి ద్వారా తిరుపతి మొదలుకొని బెంగుళూరు వరకు షోరూంలు ఏర్పాటు చేసింది సత్యం కాదా?

నీ కొడుకు ప్రస్తుతం నిర్వహిస్తున్న షాప్..హథీరామ్‌జీ మఠం భూముల్లో పెట్టిన మాట నిజం కాదా..? కొత్తగా నువ్వు కడుతున్న విల్లా ప్రాజెక్టుకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి..?

తిరుపతి అభివృద్ధి కోసం కానీ, సామాన్య భక్తులుకు మేలు చేసేలా కానీ ఒక్కటంటే ఒక్క నిర్ణయమన్నా నువ్వు తీసుకున్నావా…? వారికి లభ్ది చేకూర్చే పని ఒక్కటన్న నువ్వు చేయించావా..? నీ చిత్తశుద్ది ఏ పాటిదో తెలియదనుకుంటున్నావా..?

టీటీడీ అంటేనే తిరుమల తిరుపతి దేవస్థానం… మరి తిరుపతి అభివృద్దిలో టీటీడీకి భాగస్వామ్యం లేదా..?

శ్రీనివాస సేతు నిర్మాణంకు కేంద్రమే పూర్తిగా నిధులు ఇవ్వొచ్చు కదా…? 33శాతం మాత్రమే ఇస్తే మిగిలింది ఎవరు ఇస్తారు..?

టీటీడీకి జీఎస్టీ నుంచి మినహయింపు ఏమన్నా ఇప్పించావా? సర్వీస్ ట్యాక్స్ లేకూండా ఏమన్నా చేశావా..? వారణాసి తరహలో తిరుపతి అభివృద్దికి నిధులు రప్పించావా..?

ఆ రోజు శ్రీనివాస సేతుకి ఇలానే అడ్డుపడ్డావు..? ఇవాళ తిరుపతి అభివృద్దికి ఒక శాతం నిధులు వెచ్చిస్తూంటే ఇలానే అడ్డుపడుతున్నావు..?

టీటీడీలో అనుకోని సంఘటన జరిగితే గగ్గోలు పెడతావు.. హిందువుల మనోభావాల పేరుతో విమర్శలు చేస్తావు.. వాటికి సంభంధం లేని అధికారులను బాధ్యులను చేస్తావు.. మరి వరుస రైలు ప్రమాదాలు సంభవిస్తుంటే ఎవరిని భాద్యులను చేయాలి..?

ఇప్పటికైనా నీ పనికిమాలిన రాజకీయాలకు టీటీడీని వేదికగా చేయకు.. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా శ్రీవారి ఆలయ దేవస్థానం ప్రతిష్టని దెబ్బతీయకు అని తెలియజేస్తున్నారు. లేనిపక్షంలో అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

Post a Comment

0 Comments