గొప్ప మనసును చాటుకున్న తురుమ్ ఖాన్ లు చిత్ర నిర్మాత ఎండి అసిఫ్ జానీ

గొప్ప మనసును చాటుకున్న తురుమ్ ఖాన్ లు చిత్ర నిర్మాత ఎండి అసిఫ్ జానీ

మంచి మనసున్న మనుషులు ఇంకా భూమి మీద ఉన్నారు కాబట్టే మానవత్వం బతికుంది అనిపిస్తుంది.. కొంతమంది చేస్తున్న ఉదారమైన సేవలను చూస్తుంటే. సినిమాకు పని చేసిన కార్మికులను సినిమా అయిపోయిన తర్వాత కూడా గుర్తుపెట్టుకుని వారి అవసరం మేరకు ఆదుకోవడం అంటే ఈ రోజుల్లో అసాధ్యమనే చెప్పాలి. అలాంటిది స్టార్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ అధినేత, తురుమ్ ఖాన్ లు చిత్ర నిర్మాత ఎండి అసిఫ్ జానీ చేసిన ఒక సేవా కార్యక్రమం నేడు ఇండస్ట్రీ అందరిచే ప్రశంసలు అందుకుంటుంది. 

తెలుగు చిత్ర పరిశ్రమలో గత 40 సంవత్సరాలుగా మేనేజర్ గా పనిచేసిన కోట శ్రీనివాసరావు ప్రస్తుతం అనారోగ్యంతో ఉస్మానియాలో చికిత్స పొందుతున్నారు. ఈయన గతంలో ప్రముఖ నిర్మాత ఎండి ఆసిఫ్ జానీ నిర్మించిన చిత్రానికి పనిచేశారు. అన్ని సంవత్సరాలుగా కళామతల్లికి పనిచేసినా తన అనారోగ్యానికి చికిత్స చేసుకోలేని పరిస్థితి. విషయం తెలుసుకున్న ఆసిఫ్ జానీ తన టీంతో ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి, చికిత్సకు కావలసిన ఆర్థిక సాయాన్ని అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈయనతో పాటు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో అనేక చిత్రాలకు డీఓపీగా పనిచేసిన అజయన్ విన్సెంట్ ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీనివాస్ కు మనోధైర్యాన్ని చేకూర్చారు. 

ఈ సందర్భంగా మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. అనారోగ్యంగా ఉన్న విషయాన్ని తెలుసుకొని అందుబాటులో లేకున్నా.. ఆసిఫ్ బాయ్ ఆసుపత్రికి వచ్చి ఎంతో ఆర్థిక సాయం చేశారని అన్నారు. ఆయనకు జన్మజన్మల రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తురుంఖాన్ నిర్మాత ఎండి ఆసిఫ్ జానీ కి ధన్యవాదాలు తెలిపారు.

Post a Comment

0 Comments