ది స్టోరి ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ మూవీ రివ్యూ

ది స్టోరి ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ మూవీ రివ్యూ.. 

చిత్రం: ది స్టోరి ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్
నటీ నటులు: నిహాల్ కోదాటి, ద్రిషిక చందర్, మధు నందన్, భార్గవ్ పోలుదాస్, సమర్ద్, దేవి నాగవల్లి, మెహర్ తదితరులు
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
మ్యూజిక్ డైరెక్టర్ : అర్వీజ్
డి. ఓ. పి : అమర్ దీప్
నిర్మాతలు : ప్రసాద్ తిరువల్లూరి, పుష్యమి ధవళేశ్వరపు
స్టోరీ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : రవి ప్రకాష్ బోడపాటి

తెలుగు బ్యూటిఫుల్ హీరోయిన్ ఛార్మీ కౌర్ తో మంత్ర, మళియాల గ్లామరస్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తో బటర్ ఫ్లై చిత్రాలను తెరకెక్కించిన జెన్ నెక్ట్స్ మూవీస్ బ్యానెర్ తెరకెక్కించిన మరో చిత్రం ది స్టోరి ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్. లవ్ యాక్షన్ డ్రామా థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. యువ నటీనటులతో నేడు థియేటర్లకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకలను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం.. 

కథ: 
ఓ ఇన్యూరెన్స్ కంపనీలో పాలసీలు చేయించే రవి(నిహాల్ కోదాటి), డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మొదలు పెట్టి కళారంగంలో ఎదగాలనుకునే చరిత్ర(ద్రిషిక చందర్) చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. చరిత్ర జీవితంలో ఎదగడానికి రవి తన జీవితాన్ని సైతం పణంగా పెట్టెంత మంచి మనుసుకున్న వ్యక్తి. అనుకున్నట్లు గానే చరిత్ర తన జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటుంది. ఓ ఈవెంట్ కు డ్యాన్సర్ గా సెలక్ట్ అవడంతో చరిత్ర లైఫ్ కు టర్నింగ్ పాయింట్. అదే ఈవెంట్ లో రవి స్నేహితుడు విక్రమ్ పరిచయంతో సినిమా కొత్త మలుపు తిరుగుతుంది. రవి చరిత్ర స్నేహం ప్రేమగా మారే సమయంలో రవి నుంచి చరిత్ర దూరం అవుతుంది. కొన్నాళ్లకు చరిత్ర చనిపోయినట్లు వార్తలు వస్తాయి. ఈ కేసును ఛేదించే దిశగా పోలీసులు దర్యాప్తుచేపడుతారు. ఈ దర్యాప్తులో అనుకొని నిజాలు బయటకు వస్తాయి. అసలు విక్రమ్ ఎవరు, చరిత్రకు ఏం అయింది. రవికి, చరిత్రకు, విక్రమ్ లకు మధ్య సంబంధం ఏంటి... ఈ విషయాలను పోలీసులు ఎలా వెలికి తీశారు. ఈ కేసులో జర్నలిస్ట్ గా దేవి నాగవల్లి పాత్ర ఏంటి అంటే మీరు సినిమా చూడాల్సిందే.. 

విశ్లేషణ:
చాలా వైవిధ్యమైన కథతో నేటితరం యువతకు నచ్చేలా ది స్టోరి ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ సినిమాను తెరకెక్కించారు. హీరోగా నటించిన నిహాల్ కోదాటి తన పాత్రకు న్యాయం చేశారు. సినిమా మొత్తం ఈ పాత్రకే వెయిట్ ఉండటం వలన ఎమోషనల్ సీన్లలో తన హావభావాలను చాలా భాగా వ్యక్తపరిచారు. రోమాంటిక్ సన్నీవేశాల్లో కూడా చాలా బాగా నటించారు. ఇక కథకు ప్రాణం చరిత్ర పాత్రలో యంగ్ హీరోయిన్ ద్రిషిక చందర్ ఒదిగిపోయింది. లవ్ సీన్లలో, అలాగే ఎమోషనల్ సీన్లలో కూడా తన నటనతో కట్టిపడేసింది. క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో డ్యాన్స్ మూమెంట్ కూడా చాలా బాగా చేసింది. ఇక విక్రమ్ పాత్ర సినిమాలో నెగిటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలో యువ నటుడు మెప్పించారు. అలాగే పోలీసు ఆఫీసర్ పాత్రలో నటుడు మధు నందన్ తన పాత్ర మేరకు మెప్పించారు. ఇక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా భార్గం పోలుదాస్ కు మంచి మార్కులే పడ్డాయి. కేసును సాల్వ్ చేసే తీరులో ఆయన నటన అందరిని మెప్పించింది. అలాగే జర్నలిస్ట్ గా నటించిన ప్రముఖ జర్నలిస్ట్ దేవి నాగవల్లి కూడా తన పాత్రమేరకు మెప్పించింది. ఇక సినిమా మొత్తం స్నేహం, లవ్, ఎమోషనల్ డ్రామాతో నడుస్తూనే నేడు ఆన్ లైన్ ఆధారంగా జరిగే ఓ పెద్ద స్కామ్ ను ఎక్స్ ప్లోర్ చేశారు. అలా ఆ స్కామ్ లో చిక్కిన అమ్మాయిలను విక్రమ్ ఎలా టార్చర్ చేస్తాడు, అమ్మాయిలు ఎలా బాధ పడుతారు అనే అంశాలను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. 

సంకేతిక అంశాలు:
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ సినిమాకు కథ, కధనం, మాటలు, దర్శకత్వం అందించిన రవి ప్రకాశ్ బోడపాటి సినిమాలో తాను చెప్పాలనుకున్న పాయింట్ ను ఆద్యాంతం ఎంటర్ టైనింగ్ గా చెప్పారు. ఫస్ట్ ఆప్ అంతా ఇన్వెస్టిగేషన్ చుట్టు, ప్రేమ కథను చూపించారు. ఇక సెకండ్ ఆఫ్ సైతం అంతే గ్రిప్పింగ్ గా చూపెట్టారు. ఇలాంటి కథను చూపెట్టడంలో డెరెక్టర్ గా రవి ప్రకాశ్ బోడపాటి వందశాతం సక్సెస్ అయ్యారు. కథను నడిపించే విధానంలో కూడా డెరెక్టర్ ఎక్కడ తడబడకుండా.. సస్పెన్స్ ను చివరి వరకు అంతే థ్రిల్లింగ్ గా చూపించడంలో దర్శకుడు విజయం సాధించారు. ఇలాంటి సప్సెన్స్ థ్రిల్లర్ సినిమాలకు మ్యూజిక్ ప్రాణం లాంటింది. సరిగ్గా అలాంటి మ్యూజిక్ నే అందించారు సంగీత దర్శకుడు అర్వీజ్. కొన్ని ఎమోషన్ సీన్లలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గుండెను పిండేసెలా కొట్టారు. ఇక సినిమాటో గ్రాఫర్ గా పనిచేసిన అమర్ దీప్ ఈ సినిమాకు మైయిన్ పిల్లర్ అని చెప్పవచ్చు. ఇక చిన్నసినిమా అయినా నిర్మాతలు ప్రసాద్ తిరువల్లూరి, పుష్మమి ధవళేవశ్వరపు లు ఎక్కడ కాంప్రమైజ్ అవలేదు. ప్రొడక్షన్ విలువలు చాలా బాగున్నాయి. ఇక ఫైనల్ గా ఎడిటర్ గా పనిచేసిన ప్రవీణ్ పూడి పనితనం మెప్పించింది.

సింగిల్ లైన్:
ఒక్క మాటలో చెప్పాలంటే సోసైటీలో జరుగుతున్న ఓ పెద్ద మోసం గురించి లవ్ రోమాంటిక్ డ్రామాతో తెరకెక్కించారు. ఇది ఫ్మామిలీతో కలిసి చూడాల్సిన సినిమా.

రేటింగ్: 3/5

Post a Comment

0 Comments