పి. యస్ ఆర్ ప్రొడక్షన్స్,యం.ఆర్.ఆర్ క్రీయేషన్స్,వై.పి.బి.ఆర్ ఆర్ట్స్ పతాకంపై ఆకాశవాణి ప్రభు, ప్రమీలారాణి, ఈషాన్, తుల్యజ్యోతి, యువరాజ్, వినోద్, వీరేంద్రగిద్ద నటీ నటులుగా విజయ్ కుమార్ యల్కోటి దర్శకత్వంలో ప్రశాంత్‌కుమార్ పరిగెల, సతీష్‌కుమార్ చిప్పగిరి,లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ధర్మహ". ఈ చిత్రానికి రంగురాజేందర్, శ్రీధర్ లు సహ నిర్మాతలుగా, నవీన్ ప్రవీణ్, నరేందర్, అనంత్ రెడ్డి గంది లు లైన్ ప్రొడ్యూసర్స్ గా వ్యవహారిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్బంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్బంగా
చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. దర్శకుడు విజయ్ కుమార్ యెల్కోటి చెప్పిన కథ మా అందరికీ నచ్చడంతో ఈ సినిమా మొదలుపెట్టాము. మంచి కథ తో వస్తున్న ఈ ధర్మః చిత్రం రెగ్యులర్ ఫిల్మ్ లా ఉండదు. తప్పు చేసిన వాడిని శిక్షించడమే "ధర్మః" చిత్ర కథాంశం. ఇది పూర్తి స్లం, రగ్డ్ & క్రైమ్ అండ్ మెసేజ్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చేలా దర్శకుడు విజయ్ కుమార్ యల్కోటి చాలా రియలిస్టిక్ గా చూపించాడు, టైటిల్ కు తగ్గట్టే ఈ సినిమా ఉంటుంది. నటీ నటులు అందరూ చాలా బాగా చేశారు. వీరితో పాటు టెక్నిషియన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది.మంచి మంచి లొకేషన్స్ లలో విజయ వంతంగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకులకు ముందుకు తీసుకువస్తామని అన్నారు.
చిత్ర దర్శకుడు విజయ్ కుమార్ యల్కోటి మాట్లాడుతూ.. సినిమా ఎంతో ప్యాషన్ తో ఇండస్ట్రీ కి వచ్చిన మా నిర్మాతలు ప్రశాంత్ కుమార్ పరిగెల, సతీష్‌కుమార్ చిప్పగిరి లు ఇలాంటి మంచి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఇచ్చినందుకు వారికి నా ధన్యవాదాలు.కథకు తగ్గట్టు ఆకాశవాణి ప్రభు, ప్రమీలారాణి తదితరులు అందరూ చాలా బాగా నటించారు. సినిమాటోగ్రఫర్ నరసింహ కట్ట ప్రతి ఫ్రెం కూడా చాలా నాచురల్ గా ఉండేలా చక్కని విజువల్స్ అందించాడు. మ్యూజిక్ డైరెక్టర్ కృష్ణ సౌరభ్ గారు కంటెంట్ కి తగ్గట్టు గా అద్భుతమైన BGM’s కంపోజ్ చేసారు.మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.
చిత్ర హీరో ఆకాశవాణి ప్రభు మాట్లాడుతూ..,తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి అనే కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రంలో సూరి అనే పాత్ర చేశాను. మా దర్శక, నిర్మాతలు మాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.
నటీ నటులు
ఆకాశవాణి ప్రభు, ప్రమీలారాణి, ఈషాన్, తుల్యజ్యోతి, యువరాజ్, వినోద్,బేబీ నిహిర ,శ్రీవల్లి, వీరేంద్రగిద్ద,మురళి తదితరులు
సాంకేతిక నిపుణులు
సినిమా : ధర్మహ,
నిర్మాతలు - ప్రశాంత్‌కుమార్ పరిగెల, సతీష్‌కుమార్ చిప్పగిరి సహ నిర్మాతలు - రంగురాజేందర్, శ్రీధర్
లైన్ ప్రొడ్యూసర్ - నవీన్ ప్రవీణ్, నరేందర్, అనంత్ రెడ్డి గంది
దర్శకుడు - విజయ్ కుమార్ యల్కోటి,
డి ఓ పి - నరసింహ కట్ట,
ఎడిటర్ - కెసిబి హరి ,
సంగీతం - కృష్ణసౌరభ్,
సహ దర్శకుడు - శరణ్ వేదుల,
0 Comments