రుద్ర పిక్చర్స్ మరియు పిసిర్ గ్రూప్ సమర్పణలో మహేష్ దత్త, సోని శ్రీవాస్తవ హీరో హీరోయిన్లుగా శుక్ర దర్శకుడు సుకు పూర్వాజ్ చేస్తున్న లవ్ స్టొరి, థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ముల్టి జోనర్ గా రూపొందుతున్న కొత్త సినిమా “మాటరాని మౌనమిది”.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగష్టు 19 న గ్రాండ్ గా థియేటర్స్ లలో విడుదలవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్టైన్ చేసిందో థియేటర్ లో చూద్దాం పదండి.
కథ
మహిళ అంటే మనకు భరతమాత దగ్గర నుంచి అందరు దేవతలు గుర్తొస్తారు.వాళ్లంటే మనకో ఎమోషన్ ఉంటుంది. ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కూడా అంతే భావోద్వేగంగా సాగుతుంది. ఆమె పాత్ర 1986 కాలం, ప్రస్తుత కాలంలో ఉంటుంది. ప్లాష్ బ్యాక్ లో మాటలు రావు, ప్రెజంట్ లో వస్తాయి. హీరో రామ్ (మహేష్ దత్త)తన భావను కలవడానికి అరకు వెళ్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకరోజు బావ బిజీనెస్ పని మీద ఊరెళ్తాడు. ఆ రాత్రి రామ్ కు ఆ ఇంట్లో కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. ఇలా కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత మేడ మీదగది లోకి వెళ్లిన రామ్ కు బావ డెడ్ బాడీ కనిపిస్తుంది. అది చూసిన రామ్ ఆశ్చర్యపోతూ భయపడతాడు. అయితే ఇన్ని రోజులు నేను చూసింది ఎవరిని ఏమైందో తనకు అర్థం కాదు ఇన్నాళ్లు ఎవరి తో మాట్లాడాను అనే డౌట్ తో ఉన్న రామ్ కు మరుసటి రోజు ఉదయం రామ్ బావ ఇంటికి వస్తాడు.ఇంటికి వచ్చిన బావను చూసి నువ్వు చనిపోయావు కదా ఎలా వచ్చావ్ అని అక్షర్యపోతూ బావను అడగతాడు.. ఇంకా డౌట్ రావడంతో బావను బలవంతంగా మేడ మీద రూమ్ కు తీసుకెళ్తాడు అయితే అనూహ్యంగా అక్కడ రామ్ డెడ్ బాడీని చూసి భయపడతాడు.ఇలా..అనూహ్యంగా వీరిద్దరి డెడ్ బాడీ లు అక్కడ కనిపిస్తాయి.అయితే వీరికి అలా చనిపోయిన డెడ్ బాడీ లు ఎందుకు కనిపించాయి.
అక్కడ జరిగిన మ్యాజిక్ ఏంటి? థ్రిల్ ఏంటి అందులో దయ్యమా, భూతమా, ప్రేతాత్మ అనేది తెలుసుకోవాలంటే 1986 బ్యాక్ డ్రాప్ లో వచ్చే ట్విస్ట్స్, టర్న్స్ చూడవలసిందే అలాగే ఈ కథలో ఐదారు మలుపులు ఉంటాయి. ఇవన్నీ ఒక శాస్త్రీయ అంశంతో ఎందుకు ముడిపడి ఉంటుంది అనేది తెలుసుకోవాలంటే థియేటర్ కు వెళ్లి సినిమా చూడాల్సిందే
నటీ నటుల పనితీరు
రాము పాత్రలో హీరో మహేష్ దత్త కొత్తవాడైనా చాలా ఈజీగా నటించాడు సీత పాత్రలో క్లాసికల్ డ్యాన్సర్ గా సోనీ శ్రీవాస్తవ తన నటనతో హవా బావాలతో రెండు షేడ్స్ ఉన్న పాత్రలలో మెప్పిస్తుంది. అర్చనా అనంత్,సునీల్ శెట్టి,సంజీవ్ , శ్రీహరి ఇలా అందరూ వారికిచ్చిన పాత్రలతో కూడా చాలా చక్కగా నటించాడు ఇంకా ఇందులో నటించిన వారంతా వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు
సాంకేతిక నిపుణుల పని తీరు
ప్రతి సినిమాలో ఫిక్షన్, థ్రిల్లర్,హారర్ ఇలా ఏదో ఒక ఎలిమెంట్ ఉంటుంది. కానీ ఈ చిత్రంలో అలాంటి అన్ని అంశాలను కలిపి మల్టీ జానర్ మూవీగా తీసిన ఈ సినిమాలో రెండు లవ్ స్టోరీస్ లలో నవ్వించే ఫన్ ఎలిమెంట్స్ ను కొత్త కాన్సెప్ట్ తో చాలా చక్కగా తెరకెక్కించాడు దర్శకుడు సుకు పూర్వజ్.కథ, కథనం, సంభాషణలు, గీత రచన ఇవన్నీ చక్కగా కుదిరేలా బాగా రాసుకున్నాడు.మాటరాని మౌనమే నీ బాషకు ప్రేమవ్వాలి వంటి డైలాగ్స్ బాగున్నాయి. ఈ సినిమాకు నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది .మల్టీ జానర్ ఫిల్మ్ కాబట్టి సంగీతం కూడా వైవిధ్యంగా ఉండెలా అషీర్ లూక్ మంచి మ్యూజిక్ ఇచ్చారు . దంపుడు లక్ష్మి పాట ప్రేక్షకులలో జోష్ నింపింది .ఈ రోజేదో లిరికల్ పాట బాగుంది.శివ చరణ్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది.రుద్ర పిక్చర్స్ మరియు పిసిర్ గ్రూప్ సమర్పణలో నిర్మించిన నిర్మాతలు నేటి యువతను ఆలోచింప జేసే ప్రయత్నం చేశారు. "మాటరాని మౌనమిది సినిమా " కు వెళ్లిన ప్రేక్షకుడికి కచ్చితంగా ఎంటర్ టైన్ చేస్తుంది అని చెప్పవచ్చు.
0 Comments