M.Y.M క్రియేషన్స్ పతాకంపై ఈశ్వర్ బాబు.డి(Eswarbabu Dhulipudi) దర్శకత్వంలో సీనియర్ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ ఎం.వై.మహర్షి(M.Y Maharshi) నిర్మించిన చిత్రం ...1948 అఖండ భారత్ (1948 Akhanda Bharath). అన్ని భారతీయ, ముఖ్యమైన అంతర్జాతీయ భాషల్లో ఇటీవలే విడుదల అయింది . ఈ చిత్రంలో గాంధీగా రఘనందన్(Raghu Nandhan) నాథురాం గోడ్సే గా డా. ఆర్యవర్ధన్ రాజ్(Arya Vardhan Raaz), సర్ధార్ వల్లభాయ్ పటేల్ గా శరద్ దద్భావల,(Saradh Dadbhvala ), నెహ్రుగా మొహమ్మద్ ఇంతియాజ్(Mohammed Imtiaz), జిన్నాగా జెన్నీ(Jenny), అబ్దుల్ గఫర్ ఖాన్ గా సమ్మెట గాంధీ (Sammeta Gandhi), ప్రధాన పాత్రలు పోషించారు. గాంధీ హత్యోదంపై నిర్మించిన ఈ చిత్రం ఏవిధంగా వుందో చూద్దాం పదండి.
కథ: బ్రిటీష్ పాలకులు భారత దేశానికి స్వాతత్య్రం ప్రకటించిన అనంతరం దేశవిభజన జరిగి... హిందూ, ముస్లింల మధ్య మతకలహాలు జరిగి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షల మంది పాకిస్తాన్ నుంచి కాందిశీకులుగా భారత దేశానికి వచ్చేశారు. దానికి ప్రతీకారంగా ఇండియాలో ఉన్న ముస్లింల పైనా దాడులు జరిగాయి. ఈ మత కల్లోలాను ఆపి... విభజన సమయంలో పాకిస్తాన్ కి ఇస్తామని హామీ ఇచ్చిన రూ.55 కోట్లు ఇవ్వాలని ఢిల్లీలోని బిర్లా హౌస్ లో గాంధీ నిరాహార దీక్ష ప్రారంభిస్తారు. ఈ నిరాహార దీక్ష .... కొంత మంది హిందూ మహాసభ సభ్యులకు ఎలా ఆగ్రహం కలిగించింది? అందులో ముఖ్య సభ్యులైన వీర సావర్కర్ శిష్యులు నాదూరమ్ గాడ్సే, నారాయణ ఆప్టే అండ్ మిత్ర బృందం గాంధీని చంపడానికి ప్రేరేపించిన అంశాలు ఏవో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ... కథనం విశ్లేషణ: దేశ విభజన వల్ల భారతదేశం భౌగోళకంగా... ఆర్థికంగా... సామాజికంగా.... సాంస్కృతికంగా చిన్నాభిన్నమైనది. అందుకు కారణం అప్పటి బ్రిటీష్ పాలకులు ఓ కారణం కాగా... మరో వైపు అప్పటి కాంగ్రెస్ పార్టీ కి చెందిన నాయకులు. వారితో పాటు అహింసా వాది అయిన జాతిపిత గాంధీ. శాంతి... శాంతి అంటూ ఓ వైపు పాకిస్తాన్ కి వంత పాడటం వల్ల ఆయన ప్రాణాలనే వొదలాల్సి వచ్చిందని గాడ్సే వాదుల వాదన. 1948 అఖండ భారత్ లో రచయిత ఇందులో అదే చూపించారు. అహింసా వాది, సత్యాగ్రహి అయిన గాంధీ హత్యకు 45 రోజుల ముందు నుంచి జరిగిన పరిణామాలు, ఆయన మరణానంతరం జరిగిన ఇన్వెస్టిగేషన్ అన్నీ ఇంట్రెస్టింగ్ గా వున్నాయి. గాంధీ హత్య కేసులో ఊరి తీయబడ్డ నాధు రామ్ గాడ్సే, నారాయణ అప్టేల మృత దేహాలను దహనం చేసిన ప్లేస్ లో అమర వీరుల స్తూపాలు నిర్మిస్తారని భావించి, ఎవరికీ తెలియకుండా దహనం చేయడం లాంటి భావోద్వేగ అంశాలు ఎంతో హృద్యంగా తెరపై చూపించాడు దర్శకుడు. దేశ విభజన సమయంలో జరిగిన కొన్ని మూలన పడిన సంఘటనలు ఈతరం యువతకి తెలిసేలా వుంది ఈ సినిమా. గో అండ్ వాచ్ ఇట్.
ఈ చిత్రంలో గాంధీ పాత్రలో రఘనందన్ (Raghu Nandhan) బాగా ఆకట్టుకున్నాడు. హావ భావాలు, డైలాగ్ డెలివరీ అన్నీ చక్కగా కుదిరాయి. ఇక కీలక రోల్ నాథురాం గోడ్సే గా డా. ఆర్యవర్ధన్ రాజ్(Arya Vardhan Raaz) అలరించాడు. ఎందుకంటే ఈ పాత్రకి గాంధీ లాగ పెద్దగా రిఫరెన్స్ కూడా మనకి చరిత్రలో కనిపించవు. గాంధీని హత్య చేసిన హంతకుడిలాగే మనం చదవడం కానీ, వినడం కానీ చేశాం. ఇందులో అయితే గాడ్సే ఓ అభ్యుదయ భావాలు వున్న బ్రాహ్మణ యువకునిగా గాడ్సే ఎంత అగ్రెసివ్ గా ఉండేవారో ఆర్య వర్ధన్ రాజ్ బాగా చేసి చూపించారు. క్లైమాక్స్ కోర్ట్ సీన్ లో భావోద్వేగంతో చెప్పిన డైలాగులు చాలా కన్వెన్సింగ్ గా వున్నాయి. నారాయణ అప్టే పాత్రధారి బాగా చేసాడు. సర్ధార్ వల్లభాయ్ పటేల్ గా శరద్ దద్భావల, నెహ్రుగా మొహమ్మద్ ఇంతియాజ్, జిన్నాగా జెన్నీ, అబ్దుల్ గఫర్ ఖాన్ గా సమ్మెట గాంధీ తమ పాత్రలకు న్యాయం చేశారు.
ఆర్య వర్ధన్ రాజ్ ఎంతో రీసెర్చ్ చేసి రాసిన కథ, కథనాలను దర్శకుడు ఈశ్వర్ డి.బాబు తెరమీద బాగా చూపించారు. ప్రజ్వల్ క్రిష్ అందించిన సంగీతం బాగుంది. చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. 1948 నాటి పరిస్థితులను బాగా చిత్రీకరించారు. అందుకు తగినట్టుగా ఆర్ట్ వర్క్ బాగుంది. నిర్మాత ఎం. వై. మహర్షి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఎంతో క్వాలిటీగా సినిమాను నిర్మించారు. ఈతరం యువత తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. గో అండ్ వాచ్.
రేటింగ్: 3.5
0 Comments