ఈ సందర్భంగా బిగ్ బాస్ ఫేం సొహెల్ మాట్లాడుతూ ఫ్యాషన్ రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. ఆసక్తి ఉన్న యువతీ యువకులకు వింగ్స్ మోడల్ హబ్ మంచి వేదిక అని తెలిపారు. మిస్ అండ్ మిస్టర్ ఇండియా 2022 పోటీలకు యువతీ యువకుల నుంచి విశేష స్పందన లభించింది అని నిర్వాహకులు తెలిపారు. ఇప్పటివరకు వంద మంది పైగా యువతకు మోడలింగ్ ఫ్యాషన్ రంగంలో మంచి అవకాశాలు లభించాయని ఆయన తెలిపారు. తమ సంస్థ అసోసియేట్ అయినటువంటి ప్రముఖ సంస్థలలో విజేతలను యాడ్స్ లలో ప్రచారకర్తలుగా వినియోగించుకుంటున్నారని తెలిపారు. టాలెంట్ ఉన్న యువతీ యువకులను సినీ రంగంలో సైతం అవకాశాలు కల్పించేందుకు తన వంతు ప్రయత్నిస్తామని నిర్వహకులు మనోజ్ తెలిపారు. మిస్ అండ్ మిస్టర్ ఇండియా 2022 లోని వివిధ విభాగాల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించారు. మోడ్రన్ ,ట్రెడిషనల్ వేర్ ధరించి చేసిన ఫ్యాషన్ షో కనువిందు చేసింది . బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహెల్ సైతం ర్యాంప్ పై క్యాట్ వాక్ చేస్తూ అందరినీ అలరించారు. ఈ షోకు న్యాయ నిర్ణేతలుగాలుగా నటుడు అర్బాజ్ ఖాన్ ,కృతిక శర్మ వ్యవహరించారు..
0 Comments