నటరాజ్ మాస్టర్ బిందు ఉన్న నిన్నటి బిగ్‌బాస్‌ ప్రోమోలో సమ్మర్‌లో కంటే ఎక్కువ హీట్ కనిపించింది.

నటరాజ్ మాస్టర్ బిందు ఉన్న నిన్నటి బిగ్‌బాస్‌ ప్రోమోలో సమ్మర్‌లో కంటే ఎక్కువ హీట్ కనిపించింది. లోపల కష్టపడి గెలవటానికి సోల్జర్స్‌లా ఆడే బలమైన దమ్మున్న కంటెస్టెంట్స్‌ ఉన్నారు. కానీ బయట బిందు భజన బాగా ఎక్కువైందని లోపల వాళ్లకి బిగ్‌బాసే ఉప్పందించాడు. అదికాస్త స్ట్రాంగ్‌గా ఆడే స్ట్రాంగ్ గేమర్‌ నటరాజ్‌ మాస్టర్‌కి అర్థమైపోయినట్టుంది. అందుకే తేడాలొస్తే వెనకా ముందు ఆలోచించక స్ట్రైట్‌గా మాట్లాడేసే నటరాజ్‌ మాస్టర్‌ ముందు బిందు తట్టుకోలేకపోయింది. ఎందుకంటే పాపం ఆ పిల్ల కష్టపడి ఆడే టాస్క్‌లకి దూరం అని అందరితో అనిపించుకుంది. కానీ నటరాజ్‌ మాస్టర్‌ కిల్లర్‌ టాస్క్‌ దగ్గర నుంచి ప్రతి టాస్క్‌లలో ఈ ఆట గెలవకపోతే పరువు పోతుందన్నట్టు చెడుగుడు ఆడేసి అందరి మనస్సులు గెలుస్తున్నాడు. అతనితోపాటు శివ, అఖిల్‌, అరియాన, మిత్ర ఉండగా ఈ సుఖజీవి బిందు బయట నుంచి ‘పైసామే పరమాత్మ’ అంటూ సుఖీభవ అనిపించుకుంటే లోపల కంటే బయటే ఆవిడ చాలా స్ట్రాంగ్‌గా ఆడుతుందని అర్థమై ఆమెపై కౌంటర్‌లు మొదలెట్టారు. కష్టపడకపోయినా నేనే గెలుస్తానని బిందుకి ముందే తెలిసినట్టు తాపీగా ఉంటుంది తప్ప కంగారుపడట్లేదు. బిందు సుఖీభవ.. ఇతర కంటెస్టెంట్‌లు కష్టే ఫలి.
ఆడపులి అని పిలిపించుకోవచ్చు గానీ దానికి సమర్థత కూడా కావాలి. లేదంటే నిన్నటి బీబీ నాన్‌స్టాప్‌ ప్రోమోలో నటరాజ్‌ బిందు ని ఆడకుండా కూర్చుని చేసే పెత్తనాలపై మండిపడినట్టే, ఆ హౌస్‌లోని ప్రతి కంటెస్టెంట్‌ బిందుపై, వెనకనుండి ఆమెని లేపే ఆవిడ టీంపై రెచ్చిపోతారు. బిగ్‌బాస్‌ విన్నర్‌ అవ్వటానికి నిజంగా నిజాయితీగా హౌస్‌లో కష్టపడుతున్న వాళ్లలో రక్తం చిందించటానికి ముందు వరుసలో ఉంటాడు నటరాజ్‌ మాస్టర్‌. ఈ ఫ్యామిలీ వీక్‌ అయ్యాక వాళ్లందరి మాటల్లో కంటెస్టెంట్లకి తమ కష్టాల్ని బిందు టీం జస్ట్‌ కరెన్సీతో కవర్‌ చేసేసి ఆడపులి అని ఈసారి బిందు విన్నర్‌ అని ఫేక్ ఆర్మీ తో తెగరాయించేసుకుంటుందని లోపలున్న కష్టజీవులందరికి అర్థమైపోయింది. తమ కష్టాన్ని, టాస్క్‌లు గెలవటాన్ని ఆవిడ రాతలతో కవర్‌ చేయించేసుకుంటుందని అందరికి అర్థమైపోయింది. ఈ మధ్య బిందుని ఎవరేమన్నా ఆమె పెయిడ్‌ బ్యాచ్‌ పచ్చిగా బూతులతో కంటెస్టెంట్‌లపై పడిపోతున్నారు. ఇంతకుముందు శివ కూడా అందరు ఆడుతుంటే కాలికి పట్టీలేసుకుని ఆడకుండా కూర్చుంటుంది అన్నాడు. తర్వాత అఖిల్‌ అదేమాటంటే ఇప్పుడు నటరాజ్‌ అన్నాడు. ఈసారి నటరాజ్‌ నివురు గప్పిన నిప్పులా, రగులుతున్న కొండలా బిందుకి తగ్గకుండా కౌంటర్‌లతో అటాక్‌ చేశాడు. లేదంటే ఆ బిందు సుఖపడిపోతూ గెలిచెయ్యాలనుకోవడం కూడా కరెక్ట్‌ కాదు.ఆయన కూతురి గురించి ఈవిడ మాట్లాడొచ్చు గానీ ఆమె ఫాదర్ పేరెత్తగానే బిందులో అతి కోపం ఎందుకో.బిగ్‌బాస్‌ ఆటలో నిజాయితీ ఉండదు అనుకునే ప్రమాదం కూడా లేకపోలేదు.
ఆటలో చిచ్చరపిడుగు నటరాజ్‌ మాస్టర్‌ అని నిన్న ప్రోమోలో మళ్లీ నటరాజ్ అనిపించాడు. నీతిగా ఆట ఆడేవారెవరికైనా కోపం వస్తే అలానే ఉంటుంది మరి. లోపలుండి ఆడేవారికి బయట టీంలు వేసే వేషాలు సాద్యమైనంతవరకు నాగార్జున కానీ, ఫ్యామిలీలు కానీ లీక్‌ చెయ్యకుండా ఉండాల్సింది. బిందు మాధవి పీఆర్‌ టీం ఆమెకి ఆడపులి అని జెండర్‌నికూడా వాడేస్తూ, ఆమెని తోటి కంట్స్తెంట్ లు ఏమన్నా సరే వారి పై భూతులతో విచ్చలవిడిగా కామెంట్లు పెట్టీ మరీ అటాక్ లు చేస్తున్నారు. గెలిపించుకోవటానికి అహర్నిశలు కష్టపడుతున్నారని అందరు దానికి ఇన్‌ఫ్లూయెన్స్‌ అయిపోతున్నారని లోపలి వారికి కూడా అర్థమై పోయింది. పాపం టఫ్‌గా టాస్క్‌లు ఆడే శివ, నటరాజ్‌, అరియాన, మిత్ర లాంటి వాళ్లకి ఇది రివీల్ అయినట్టుంది.ఈసారి లేడీ విన్నర్‌కే కిరీటం పెట్టాలని ముందే ఫిక్స్‌ అయిపోయినట్టు తెలిసిపోతుంది.. కానీ బాగా చదివేవాడికి తన మార్క్‌ల కంటే రెస్ట్‌లో ఉన్నాడికి వస్తున్నాయంటే ఇక్కడ సమర్థత అక్కర్లేదా అని కోపం రావటం సహజమే. ఎప్పటికైనా నిజం బయటపడక మానదు. నటరాజ్‌ మాస్టర్‌, అఖిల్‌, శివలాంటి వాళ్లకి కోపం కలగక మానదు. కానీ ఈసారి నటరాజ్‌ మాస్టర్‌ విశ్వరూపం, దశావతారం, ప్రభంజనం లాంటి పదాలకి సరిపోయే పెర్‌ఫార్మెన్స్‌ మాత్రం ప్రోమోలో చూపించాడు అనేది సత్యం.

Post a Comment

0 Comments