"తెప్ప సముద్రం" ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

"తెప్ప సముద్రం" ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ ఫెమ్ చైతన్య రావ్ సిగరెట్ చేత్తో పట్టుకొని గడ్డం తో ఏదో ఆలోచిస్తూ సరికొత్త లుక్ తో ఈ సినిమా లో హీరో గా రాబోతున్నాడు. మరో హీరో గా నటుడు అర్జున్ అంబటి నటిస్తున్నారు. ఉగాది పండుగ సందర్భంగా విడుదల అయిన ఈ పోస్టర్ కు మంచి స్పందన లభించింది.ఒక యథార్థ సంఘటన ఆధారంగా పల్లెటూరు థ్రిల్లర్ సస్పెన్స్ కథగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సతీష్ రాపోలు దర్శకత్వం వహిస్తున్నారు,శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ బేబీ వైష్ణవి సమర్పణ లో నీరుకంటి మంజుల రాఘవేందర్ గౌడ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఈ చిత్రం మొదటి షెడ్యూల్ తెలంగాణ లోని పలు పల్లెటూరు లో చేస్తున్నారని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు..

డైరెక్టర్ సతీష్ రాపోలు మాట్లాడుతూ. ఈ చిత్రం ఒక యదార్థ సంఘటన ఆధారంగా తీసుకొని ఎవ్వరు ఊహించిన విధంగా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతుంది అని అన్నారు. 

నిర్మాత నీరుకంటి మంజుల రాఘవేందర్ గౌడ్ మాట్లాడుతూ “ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి స్పందన లభించింది,కొత్తవాళ్ళకి ఇండస్ట్రీ వెల్కమ్ చెప్పినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, ఇదే ఉత్సహంతో సినిమాని కూడా తెరకెక్కిస్తాం.త్వరలో మీ ముందుకు వస్తాం” అని తెలిపారు.

నిర్మాత: నీరుకంటి మంజుల రాఘవేందర్ గౌడ్
రచన – దర్శకత్వం : సతీష్ రాపోలు
సంగీతం : పీ. ఆర్
డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ:నాని చమిడి శెట్టి,శేఖర్ పోచంపల్లి
ఎడిటర్:ఎస్. బి.రాజు తలారి
ప్రొడక్షన్ డిజైనర్: పున్న శ్రీనివాస్

Post a Comment

0 Comments