ఆది పినిశెట్టి ఓ వైపు హీరోగా... మరోవైపు మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలు, తమిళ భాషల్లో నటిస్తూ... మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు తాజాగా ఆకాంక్ష సింగ్ తో జతకట్టి 'క్లాప్' కొట్టాడు. ఇది తెలుగు, తమిళ భాషల్లో సోనీ లివ్ లో ఎక్సక్లూజివ్ గా స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ చిత్రం ఎలా వుందో చుద్దాం పదండి.
కథ: హీరో ఆది పినిశెట్టికి (విష్ణు) యాక్సిడెంట్ అవుతుంది. ఆ ప్రమాదంలో తన తండ్రి(ప్రకాష్ రాజ్)ని కోల్పోతాడు విష్ణు. అప్పటికే రన్నింగ్‌లో స్టేట్ చాంపియన్‌గా గెలుపొంది, నేషనల్ చాంపియన్ షిప్‌లో పాల్గొనటానికి ప్రిపేర్ అవుతుంటాడు అంతలోనే ప్రమాదం జరగటంతో తన కుడికాలును కోల్పోతాడు. ప్రమాదంలో తన కాలును కోల్పోయినప్పటికి తను ప్రేమించిన అమ్మాయి ఆకాంక్ష సింగ్ (మిత్ర) తననే పెళ్లి చేసుకుంటాను అనటంతో పాటు తనను చేసుకోపోతే చనిపోతాను అని బెదిరించటంతో మరో దారి లేక ఆమెను పెళ్లి చేసుకుంటాడు విష్ణు. స్పోర్ట్స్ కోటాలో వచ్చిన చిన్న ఉద్యోగంలో స్థిరపడి... తను కోల్పోయిన కెరీర్ గురించి రోజు ఫీలవుతూ ఉంటాడు. ఎప్పటికైనా జాతీయస్థాయిలో రాణించటానికి మంచి నైపుణ్యమున్న రన్నర్‌ను వెతికే పనిలో పడతాడు. అలా టాలెంట్ ఉన్న రన్ మిషన్‌ను వెతుకుతుంటే అదే ఆఫీస్‌లో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటుంది భాగ్యలక్ష్మీ(కృష్ణ కురూప్). 400 మీటర్ల రన్నింగ్ కాంపిటేషన్‌లో మెరుగైన నైపుణ్యాన్ని ప్రదర్శించే భాగ్యలక్ష్మీ... ఎందుకు తన పరుగును ఆపేయ్యలనుకుని ఉద్యోగం చేయాలనుకుంటుంది? ఆమెకు ఎదురైన సంఘటనలు ఏంటి? ఆణిముత్యంలాంటి ఒక మంచి రన్నర్ అయిన విష్ణు... కెరీర్ ఒక యాక్సిడెంట్‌తో ఆగిపోవటానికి కారణం ఏంటి? నేషనల్ లెవల్‌లో రన్నింగ్ చేసి గోల్డ్‌మెడల్ సాధించాలనుకున్న తన లక్ష్యం ఏమైంది? అనేది తెరమీద చూడాల్సిందే.
కథనం: గతంలో ఇటువంటి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ కథలు చాలా వచ్చాయి. ఆటలకు సంబంధించిన కథలను తెరకెక్కిస్తున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా కథ చెప్పాలి. ఈ విషయంలో దర్శకుడు పృథ్వీ తన మొదటి సినిమా అయినప్పటికి ఎక్కడా తడబడకుండా తను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పాడు. అలాగే ఆది పినిశెట్టి పాత్రను డిజైన్ చేసిన విధానం చాలా కొత్తగా ఉందని చెప్పాలి. హీరో అంటే నాలుగు ఫైట్‌లు, నాలుగు పాటలు, మధ్యలో కొంచెం కామెడీ ఉంటే చాలు సినిమాలు పాస్ అవుతాయి అనుకునే ఈ కాలంలో ఇటువంటి కథను తెరకెక్కించటం కత్తి మీద సాములాంటిదే. చెప్పాలనుకున్న పాయింట్‌ని ఎక్కడ పక్కకు వెళ్లకుండా ఏ కమర్షియల్ అంశాలను జోడించకుండా కథ ఒకే పంథాలో ప్రయాణం చేస్తుంది. ఇళయరాజ సంగీతం తోడయినప్పటికీ, కథలో లీనమవ్వడంతో అది ఎక్కడ పెద్దగా వినిపించదు.
బలాలు:
★ ఆది పినిశెట్టి క్యారెక్టర్, కృష్ణ కురూప్
★ నిర్మాణ విలువలు
★ క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్
బలహీనతలు:
★ ఫస్టాప్ స్లోగా ఉండటం
★ అవసరం లేని కొన్ని సీన్‌లు
రేటింగ్: 3.25
0 Comments