సినీ ప్రముఖుల సమక్షంలో "తెర" చిత్రం ప్రారంభం!!

సినీ ప్రముఖుల సమక్షంలో "తెర" చిత్రం ప్రారంభం!!

రేడియంట్ రీల్స్ నిర్మాణంలో శ్రీ సినిమా సమర్పణలో శ్రీచంద్ జీ తెరకెక్కిస్తున్న సినిమా "తెర" ఈ సినిమాకు సంబంధించిన ముహూర్త కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం కల్చరల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారి చేతులమీదుగా రవీంద్రభారతిలో(హైదరాబాద్) మొదలయ్యాయి. సీనియర్ దర్శకుడు వి.ఎన్. ఆదిత్య తొలి షాట్ కు గౌరవ దర్శకత్వం వహించారు. ప్రముఖ సీనియర్ ఛాయాగ్రాహకుడు ఎస్. గోపాల్ రెడ్డి గారు కెమెరా స్విచాన్ చేశారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్న ఈ చిత్రం. పాత్రికేయుల సమావేశంలో...

పద్యనాటక నటుడు, రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ గారు మాట్లాడుతూ.. ‘శ్రీచంద్ గారు తీసుకున్న కథా విధానం చాలా అద్భుతంగా ఉంది. తెర అంటూ టైటిల్ పెట్టి ఎన్నో వేలాది మంది ఫోటోలు పెట్టి వాళ్లకు ఘనమైన నివాళి అందించారు. ఈ సినిమాలో నాన్న మీద ఓ పాట ఉంది. అది కూడా శ్రీచంద్ గారే రాసారు. అది చాలా అద్భుతంగా ఉంది. ఈ పాట మీ హృదయాల్లో ఉండిపోతుంది. మంచి కథను రంగస్థల నటులతో తెరకెక్కిస్తున్న ఈ తెర సినిమా అద్భుతమైన విజయం సాధించాలని కోరుకుంటున్నాను..’ అని తెలిపారు. 

హీరో కోట్ల హనుమంతురావు గారు మాట్లాడుతూ.. ‘తెర అనేది మ్యాజిక్ ఆఫ్ స్క్రీన్ మాదిరే ఉంటుంది. సినిమా అయినా.. తెర అయినా కథ కథే. మరాఠీలో పూర్తిగా రంగస్థలం నేపథ్యంలో ఆ నటీనటులతోనే వచ్చిన సినిమా నట సామ్రాట్. నానా పటేకర్ నటించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఇప్పుడు తెలుగులో పూర్తిగా రంగస్థల నటులతో వస్తున్న సినిమా తెర. రంగస్థల కథలో ఆర్టిస్టులు.. సినిమా సంబంధిత కథలో సినిమా నటులు కనిపిస్తున్నారు. రంగస్థలంకు సంబంధించిన చాలా మంది నటీనటులు ఇందులో ఉన్నారు. సురభి టెక్నిక్స్ కూడా వాడుకుని ఈ చిత్రం చేయబోతున్నాం. రంగస్థలం పాత్రనే సినిమాలో కూడా నటిస్తుండటం ఆనందంగా ఉంది.. త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్‌తో మిమ్మల్ని కలుస్తాం..’ అని తెలిపారు.

కొరియోగ్రఫర్, ఆర్టిస్ట్ పాపి మాట్లాడుతూ.. ‘నా పేరు పాపి. కొరియోగ్రఫర్ నుంచి ఆర్టిస్టుగా వస్తున్నాను. తెలుగు ఇండస్ట్రీలో మొదటి సినిమా ఇది. ఓ t v ఇంటర్వ్యూ చూసి ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు చందూ సర్. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు చందూ సర్, నిర్మాత వేణు మనోహర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు..’ తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం కల్చరల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారూ మాట్లాడుతూ.. ‘91 ఏళ్ళ తెలుగు సినిమాలో ఇప్పటి వరకు వేలాది సినిమాలను సృష్టించింది. లక్షలాది మంది నటులు పరిచయమయ్యారు. సాంకేతిక నిపుణులు, దర్శకులకు ఆశ్రయం ఇచ్చింది. సినిమా పరిశ్రమలో యువకులకు టాలెంట్ చూపించడం కోసం తహతహలాడుతున్నారు. శ్రీచంద్‌లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. కంటెంట్ డ్రివన్ సినిమా చేస్తుండటం.. సమాజంలో మార్పును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మంచి కథ రాసుకున్నాడు.. నేను కూడా విన్నాను కథ.. నిర్మాత కూడా ఈ కథను మెచ్చి ఈ రోజు రవీంద్ర భారతిలో సినిమా మొదలుపెట్టారు.. ఈ సినిమాలో కోట్ల హనుమంతరావు గారు నటించడం.. పాపి హీరోయిన్‌గా నటిస్తుండటం.. గుమ్మడి గోపాలకృష్ణ లాంటి గొప్పవాళ్లు ఈ సినిమాలో పోషిస్తున్నారు. ఈ సినిమా మంచి తపనతో పని చేస్తున్నారు. "తెర" కచ్చితంగా విజయం సాధిస్తుందని.. తనదైన ముద్ర వేస్తుంది..’ తెలిపారు.

నిర్మాత వేణు మనోహర్ రెడ్డి గారు మాట్లాడుతూ.. ‘మంచి కథతో వస్తున్నాం.. తండ్రీ కొడుకుల మధ్య అనుబంధాన్ని చూపిస్తున్నాం. మూడు షెడ్యూల్స్‌లో సినిమాను పూర్తి చేస్తున్నాం.. మొదటి షెడ్యూల్ ఇప్పుడు మొదలైంది. త్వరలోనే రెండు షెడ్యూల్స్ కూడా పూర్తి చేసి.. అక్టోబర్ లేక దసరాకు విడుదల చేస్తాం..’ అని తెలిపారు.

దర్శకుడు శ్రీచంద్ మాట్లాడుతూ.. ‘తెర సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాను. తెర" అంటే తెలుగు రంగస్థలం. రంగస్థలం నుంచి మొదలై సినిమా వరకు పయనించే కథ ఇది. తండ్రీ కొడుకుల మధ్య రెండు తరాలను కలిపే కథలా ఉంటుంది. సినిమాలా కాకుండా నిజ జీవితంలో జరిగిన సంఘటనల నుంచి అల్లుకున్న కథ ఇది. సినిమా అనేది పవర్ ఫుల్ మీడియా.. మంచిగా చెప్తే సమాజానికి ఉపయోగపడుతుందని నమ్మేవాన్ని. కుటుంబ విలువలతో కూడుకున్న కథ.. అందరికీ కనెక్ట్ అవుతుందనే నమ్మకం ఉంది.. ఈ చిత్రం లో 6. పాటలుంటాయి. ఐటం సాంగ్స్... కామెడీ ట్రాక్స్ ఉండవు.. కథ రాసుకున్నపుడే రంగస్థలానికే సంబంధించిన కథ కాబట్టి రంగస్థల నటులను తీసుకున్నాం.. సినిమా చాలా బాగా వస్తుంది..’ అని తెలిపారు. 

నటీనటులు: 
శ్రీ వినాయక నాట్య మండలి సురభి ట్రూప్, ఆర్. వేణు గోపాల రావు, 
కోట్ల హనుమంతరావు, గుమ్మడి గోపాలకృష్ణ, పాపి మాస్టర్ తదితరులు.. 

టెక్నికల్ టీమ్:
దర్శకుడు: శ్రీచంద్ జీ
నిర్మాత: వేణు మనోహర్ రెడ్డి నంద్యాల
ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్
సినిమాటోగ్రఫీ: బురాన్ షేక్ (సలీం)
సాహిత్యం : శ్రీ చంద్, గీతా కృష్ణ వడ్లమాని

పి.ఆర్.ఓ: లక్మి నివాస్

Post a Comment

0 Comments