బీసీ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మణిశర్మ
తెలంగాణ రాష్ట్ర బీసీ సమితి ఉపాధ్యక్షుడిగా ధర్మారం మండలంలోని మేడారం గ్రామానికి చెందిన చిప్ప మణిశర్మను నియమిస్తూ రాష్ట్ర బీసీ సమితి అధ్యక్షుడు, కార్పొరేషన్ చైర్మన్ నాగేందర్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా మణిశర్మ మాట్లాడుతూ బీసీ సమితిని బలోపేతం చేయుటకు ప్రతి గ్రామంలో కమిటీ లు వేస్తామన్నారు. తన నియామకానికి సహక రించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
0 Comments