అంగరంగ వైభవంగా నటి జ్యోతి పుట్టినరోజు వేడుకలు !!!

అంగరంగ వైభవంగా నటి జ్యోతి పుట్టినరోజు వేడుకలు !!!

ఎన్నో చిత్రాల్లో విభిన్నమైన పాత్రలతో అలరించిన నటి జ్యోతి. ఇటీవల ఆమె బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసిన సంగతి తెలిసిందే. గురువారం జ్యోతి పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్ లోని ఒక ప్రవేట్ హోటల్ లో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకకు సినీ తారలు హాజరయ్యారు.

మొమైత్ ఖాన్, రఘు కుంచె, ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు, రాహుల్ సిప్లిగంజ్, శ్రీకాంత్ అయ్యంగార్ జివి.నటుడు లతో పాటు పలువులు ఫిలిం పర్సనలిటీస్ అటెండ్ అయ్యారు. 

ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ..
నా బర్త్ డే సెలెబ్రేషన్స్ కు వచ్చిన అందరికి ధన్యవాదాలు, నేను ఈ పుట్టినరోజును మర్చిపోలేను. రాబోయే రోజుల్లో మరిన్ని మంచి పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్ మీడియా వారికి ధన్యవాదాలు. త్వరలో నేను చేసే సినిమాల వివరాలు మీడియాకు తెలియజేస్తానని తెలిపారు.

Post a Comment

0 Comments