మురుగన్ చిత్ర సెట్ లో నిర్మాత దిరిశాల నరేష్ చౌదరి జన్మదిన వేడుకలు !!!

మురుగన్ చిత్ర సెట్ లో నిర్మాత దిరిశాల నరేష్ చౌదరి జన్మదిన వేడుకలు !!!

DNC. అధినేత DKC బ్యానర్ నిర్మాత దిరిశాల నరేష్ చౌదరి జన్మదిన వేడుకలు శుక్రవారం చిత్ర సెట్స్ లో జరిగాయి. ఈ సందర్భంగా నిర్మాత 
దిరిశాల నరేష్ చౌదరి మాట్లాడుతూ... సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ హీరోగా విహారిక హీరోయిన్ గా సతీష్ (నాని) దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా మురుగన్, ఇటీవల లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. త్వరలో ఈ సినిమాకు సంభందించిన విశేషాలు తెలుపుతాము. నా పుట్టినరోజును ఇలా చిత్ర యూనిట్ సభ్యులతో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో DNC డైరెక్టర్ మల్లికార్జున్ సూర్యదేవర మరియు డైరెక్టర్ సతీష్ (నాని) తదితరులు పాల్గొన్నారు. మురుగన్ చిత్రం కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారంగా తెరకెక్కుతోందని అన్ని వర్గాల ప్రేక్షకులకు కావాల్సిన కమర్షియల్ అంశాలు ఉంటాయని దర్శకుడు సతీష్ తెలిపారు.

Post a Comment

0 Comments