గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకం పై విదార్థ్ , ధృవిక హీరో, హీరోయిన్లుగా వాలాజా క్రాంతి దర్శకత్వంలో వాలాజా గౌరి, రమేష్ ఉడత్తులు నిర్మిస్తున్న చిత్రం “భగత్ సింగ్ నగర్”. తెలుగు మరియు తమిళ బాషలలో ఏక కాలంలో చిత్రీకరించి విడుదల అయిన ఈ సినిమాకి మొదటి నుంచి మంచి బజ్ ఉంది. మంచి ఇంటెన్స్ కథతో తెరకెక్కిన ఈ చిత్రం ఎలా వుందో చూద్దాం పదండి.
కథ: భగత్ సింగ్ నగర్… ఇదొక స్లమ్. అందులో శీను, లక్ష్మి ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఓ సారి… సముద్రం ఒడ్డున ప్రేమించుకుంటూ ఉండగా… వీరిని కొంత మంది ఆకతాయిలు ఇద్దరినీ చంపేస్తారు. అలానే భగత్ సింగ్ నగర్ కి చెందిన కొంత మంది అమ్మాయిలను కిడ్నాప్ చేస్తూ ఉంటుంది ఆ ఆకతాయిల బ్యాచ్. వీరికి ఓ పోలీస్ అధికారి(బెనర్జీ) అండతో పాటు… స్థానిక MLA YC రావ్(అజయ్ ఘోష్) ప్రోత్సాహం ఉండటంతో యువతులను యథేచ్ఛగా కిడ్నాప్ చేస్తుంటారు. కట్ చేస్తే… భగత్(విదార్ధ్) అనే యువకుడు భగత్ సింగ్ నగర్ మీద ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలని ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. అదృశ్యం అయ్యే అమ్మాయిలు ఏమవుతున్నారనే దానికోసం అన్వేషణ చేస్తుండగా… స్థానిక MLA YC రావు హత్యకు గురవుతాడు. ఈ హత్యకేసులో భగత్ అనుమతినిగా మారతాడు. మరి ఈ కేసు నుంచి భగత్ ఎలా బయట పడ్డారు? భగత్ సింగ్ నగర్ నుంచి కిడ్నాప్ అయిన అమ్మాయిలతో ఏమి చేయిస్తున్నారు? దాని వెనక ఉన్న పాత్రధారులు ఎవరు ? భగత్ వాళ్ళ ఆట ఎలా కట్టించారనేదే మిగతా కథ.
కథ.. కథనం విశ్లేషణ: సరోగసీ విధానం మీద దర్శకుడు ఎంచుకున్న కీ పాయింట్ బాగుంది. దీనిపై ఇప్పటికీ భారత ప్రభుత్వం ఎందుకు చట్టబద్ధం చేయలేదో ఈ సినిమా చూస్తే అర్థం అవుతుంది. చట్టబద్ధత కల్పిస్తే ఎలా దుర్వినియోగం అవుతుందో అనేది దర్శకుడు బాగా చూపించాడు. ఇల్లీగల్ గా నే… ఈ విధానంతో సొసైటీలో గౌరవ ప్రదమైన వృత్తిలో ఉన్న వారు ఎలా కోట్లు గడిస్తున్నారనేది చూపించి ప్రభుత్వానికి ఓ మెసేజ్ ఇచ్చారు. ఈ విధానం అమలుకోసం బస్తీలో నివసించే అమాయక ఉమెన్ ట్రాఫికింగ్… అందుకు ఉపయోగపడే రాజకీయ, పోలీసు వ్యవస్థ… దాన్ని సొమ్ము చేయడానికి పవిత్రమైన వృత్తిలో వుండే వైద్యులు… ఇలా అన్ని వ్యవస్థలు కలిసి సరోగసీ విధానాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నాయో చక్కగా ప్రెజెంట్ చేశారు.
కొత్త కుర్రాడు విదార్థ్ రెండు పాత్రల్లో వెరీయేషన్ చూపించి సెటిల్డ్ గా నటించారు. బస్తీ సీనుగా… మరోవైపు షార్ట్ ఫిల్మ్ తీసే భగత్ పాత్రల్లో ఎంతో వైవిధ్యమైన నటన చూపించి మెప్పించారు. అలానే హీరోయిన్ గా నటించిన ధ్రువిక కూడా బస్తీలో బతికే లక్ష్మీ గానూ… సిటీలో ఉండే భగత్ స్నేహితురాలు అనన్య పాత్రల్లో చక్కగా ఒదిగిపోయింది. పోలీసు ఆఫీసర్ సంపత్ గా బెనర్జీ చాలా క్రూయల్ మెంటాలిటీ ఉన్న పాత్రను పోషించి మెప్పించారు. కాసేపు ఉన్న పొలిటీషియన్ పాత్రలో అజయ్ ఘోష్ పర్వాలేదు అనిపించాడు. చంద్రయ్య పాత్రలో క్యారెక్టర్ నటుడు ముని చంద్ర హీరోయిన్ తాత పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇక కీలక పాత్రలో నటుడు రవిప్రకాష్ కనిపించి క్లయిమాక్స్ లో ట్విస్ట్ ఇచ్చాడు.
దర్శకుడు ఎంచుకున్న కథ… కథనాలు బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో శీను, లక్ష్మి పాత్రలను బస్తీలో ఎంత రస్టిక్ గా చూపించారో… సిటీలో భగత్, అనన్య పాత్రలను అంతే క్లాస్ గా చూపించారు. సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ క్వాలిటీగా ఉంది. బస్తీ జీవితాలను లైవ్ లీగా చూపించారు. ఎడిటింగ్ పర్వాలేదు. సినిమా నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. గో అండ్ వాచ్ ఇట్.
రేటింగ్: 3/5
0 Comments