అభినవ్ సర్ధార్, రామ్ కార్తిక్, చాందిని తమిళ్ రాసన్, శెర్రి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో ఎ.ఎస్.పి.మీడియా హౌస్, జి.వి.ఐడియాస్ పతాకాలపై సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం “రామ్ అసుర్”..శాని సాల్మాన్ ఓ ముఖ్య పాత్రను పోషించారు. వెంకటేష్ త్రిపర్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అభినవ్ సర్ధార్, వెంకటేష్ త్రిపర్ణ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి మొదట “పీనట్ డైమండ్” అనే టైటిల్ ని పెట్టారు. అయితే చిత్రం మాస్ ఆడియన్స్ కు రీచ్ కావాలనే ఉద్దేశంతో ఈ చిత్ర టైటిల్ ను `రామ్ అసుర్`గా మార్చారు. ఈ సినిమాలోని పాటల విడుదల మొదలుకొని టీజర్, ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు… టాలీవుడ్ ప్రముఖులు విడుదల చేయడంతో సినిమా కి మంచి బజ్ ఏర్పడింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈచిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సైన్స్ ఫిక్షన్ డ్రామా ఎలా ఉందో చూద్దాం పదండి.
కథేంటి అంటే… రామ్(రామ్ కార్తీక్) ఎలాగైనా శాస్త్ర పరిజ్ఞానంతో కృత్రిమంగా ల్యాబ్ లో పీనట్ ఇన్ గ్రేడియంట్ ఉపయోగించి డైమండ్ ను తయారు చేయాలనుకుంటాడు. అయితే అందులో 70 శాతం మాత్రమే సక్సెస్ అవుతాడు. ఎంత ప్రయత్నించినా 80 శాతం ఫ్యూరిటీ ఉన్న డైమండ్ ను తయారు చేయలేకపోతాడు. అదే సమయంలో తాను ప్రాణంగా ప్రేమించిన ప్రియా(శెర్రి అగర్వాల్) కూడా రామ్ కి హ్యాండ్ ఇచ్చి.. బాగా డబ్బున్న అబ్బాయిని వివాహం చేసుకొని వెళ్ళిపోతుంది. ఇలా తన ఫెయిల్యూర్స్ కి కారణం ఏంటని తెలుసుకోవడానికి తమిళనాడులోని వైదీశ్వర్ కోయల్ కి వెళ్లి… నాడీ జ్యోతిష్యం చెప్పించుకోవడానికి రామనాధం మాస్టర్(శుభలేఖ సుధాకర్)వద్దకు వెళ్లి కనుక్కుంటాడు. రామ్ స్టోరీని అంతా విన్న.. మాస్టారు… నీ ఫెయిల్యూర్స్ కి అసలు కారణం తెలియాలంటే… రామాపురం వెళ్లి సూరి(అభినవ్ సర్దార్) అనే వ్యక్తి గురించి తెలుసుకో… నీ ఫెయిల్యూర్ కి కారణం తెలుస్తుంది అని సూచిస్తారు. మరి రామాపురం వెళ్లి… రామ్ ఏం తెలుసుకున్నారు? రామ్ కి… సూరికి మధ్య ఉన్న పోలిక ఏంటి? చివరకు రామ్ 80 శాతం ఫ్యూరిటీ ఉన్న డైమండ్ ను తయారు చేశాడా? లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ… కథనాలు ఎలా ఉన్నాయంటే… 1954లో ఓ సైంటిస్ట్ పీనట్ ఇన్ గ్రేడియంట్ ద్వారా డైమండ్ ను తయారు చేయవచ్చనే పాయింట్ ని ప్రధానంగా తీసుకుని… దానికి యాక్షన్ డ్రామా జోడించి ఓ మంచి మాస్ కమర్షియల్ మూవీగా తెరకి ఎక్కించిన తీరు ప్రేక్షకులను అలరిస్తుంది. 30 ఏళ్ళ క్రితం సూరి విషయంలో జరిగిన సంఘటనలే… రామ్ జీవితంలోనూ ఎందుకు జరుగుతున్నాయో కంక్లూజన్ ఇవ్వడానికి నాడీ జ్యోతిష్యం ద్వారా చెప్పించడం చాలా కన్వెన్సింగ్ గా ఉంది. అలానే కృత్రిమంగా డైమండ్ ని ల్యాబ్ లో గతంలో తాయారు చేయడానికి ప్రయత్నించిన శాస్త్రవేత్తల పేర్లను ఉటంకిస్తూ… సైన్స్ ని చెప్పడం ఆడియన్స్ ని మెప్పిస్తుంది. మాస్ ని మెప్పించేందుకు యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయి.
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అభినవ్ సర్దార్ మాస్ హీరోగా అలరించారు. తన ప్రేయసి… తనను వదిలేయడమే కాకుండా అవమానించి… బాగా ఉన్నోడిని చేసుకోవడంతో… పగ తీర్చుకునే భగ్న ప్రేమికుడిగా… మరో వైపు డైమండ్ ను తయారు చేయాలనే బాగా చదువుకున్న యువ శాస్త్రవేత్తగా మెప్పించారు. తనకి జోడీగా నటించిన చాందిని పల్లెటూరి అమ్మాయిగా లంగా ఓణీలో కనిపించి ఆకట్టుకుంది. రామ్ కార్తిక్ కూడా ఓ వైపు లవర్ బాయ్ గా… మరో వైపు మంచి ఫ్యూరిటీ విన్న డైమండ్స్ తయారు చేసి ప్రపంచంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే తపన ఉన్న యువకుని పాత్రలో అలరించారు. తనకి జోడీగా నటించిన శెర్రి అగర్వాల్ కూడా తన పాత్ర మేరకు బాగా చేసింది. నటుడు శాని ఓ ముఖ్యపాత్రలో చివరి దాకా సస్పెన్స్ కొనసాగిస్తూ.. బాగా నటించాడు. మంచి ఫుల్ లెంగ్త్ రోల్ పోషించి మెప్పించారు. సుమన్, శుభలేఖ సుధాకర్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగుంది. దానికి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా సినిమాను వెండితెరపై ఆవిష్కరించిన తీరు బాగుంది. సయింటిఫిక్ డ్రామానే అయినా ఎక్కడా బోరింగ్ లేకుండా సినిమాను రూపొందించి సక్సెస్ అయ్యాడు దర్శకుడు వెంకటేష్. భీమ్స్ అందించిన సంగీతం బాగుంది. పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. చివరగా… సైన్స్ ఫిక్షన్ డ్రామాగా “రామ్ అసుర్”మెప్పిస్తుంది. ఈవారం తప్పక చూడండి
రేటింగ్: 3.5/5
0 Comments