తెలంగాణ దేవుడు మూవీ రివ్యూ, రేటింగ్ !!!

తెలంగాణ దేవుడు మూవీ రివ్యూ, రేటింగ్ !!!


నటీనటులు:
పబ్లిక్ స్టార్‌ శ్రీకాంత్, జిషాన్ ఉస్మాన్ (తొలి పరిచయం), సంగీత, బ్రహ్మానందం, సునీల్, సుమన్, బ్రహ్మాజీ, వెంకట్, పృథ్వీ, రఘుబాబు, షాయాజి షిండే, విజయ్ రంగరాజు, బెనర్జీ, చిట్టిబాబు, మధుమిత, సత్యకృష్ణ, సన, రజిత, ఈటీవీ ప్రభాకర్, సమీర్, బస్ స్టాప్ కోటేశ్వరరావు, కాశీ విశ్వనాథ్, జెమిని సురేష్ తదితరులు 

 సాంకేతిక నిపుణులు:
మ్యూజిక్: నందన్ బొబ్బిలి
సినిమాటోగ్రాఫర్: అడుసుమిల్లి విజయ్ కుమార్
ఎడిటర్: గౌతంరాజు
లైన్ ప్రొడ్యూసర్: మహ్మద్ ఖాన్
పీఆర్వో: బి. వీరబాబు
మూల కథ, నిర్మాత: మొహహ్మద్ జాకీర్ ఉస్మాన్
రచన, దర్శకత్వం: వడత్యా హరీష్

ఉద్యమ నాయకుడిగా శ్రీకాంత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. జిషాన్‌ ఉస్మాన్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ దర్శకుడు సాగర్ శిష్యుడైన వడత్యా హరీష్ ఈ చిత్రానికి దర్శకుడు. మొహమ్మద్‌ జాకీర్‌ ఉస్మాన్‌ నిర్మాత. ఇందులో సంగీత, బ్రహ్మానందం, సునీల్, సుమన్, బ్రహ్మాజీ, వెంకట్, పృథ్వీ, రఘుబాబు, షాయాజి షిండే, విజయ్ రంగరాజు, బెనర్జీ, చిట్టిబాబు, మధుమిత, సత్యకృష్ణ, సన, రజిత, ఈటీవీ ప్రభాకర్, సమీర్, బస్ స్టాప్ కోటేశ్వరరావు, కాశీ విశ్వనాథ్, జెమిని సురేష్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా వుందో చూద్దాం పదండి.

కథ : 

విజయ్ దేవ్ (శ్రీకాంత్) తన చిన్నతనం నుంచే (చిన్ననాటి విజయ్ దేవ్ గా జిషాన్ ఉస్మాన్ నటించాడు) తెలంగాణలో ప్రజలు పడుతున్న కష్టాలను బాధలను అర్ధం చేసుకుంటూ పెరుగుతాడు. తన తండ్రి స్పూర్తితో జై సార్ ను ఆదర్శంగా తీసుకుని ఉద్యమ బాట పడతాడు. ఈ నేపథ్యంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య విజయ్ దేవ్ రాజకీయ నాయకుడిగా మారతాడు. అయితే, వేరే రాజకీయ పార్టీల కారణంగా తన తెలంగాణకు న్యాయం జరగట్లేదని ఇక తనే సొంతంగా బంగారు తెలంగాణ పార్టీ పెట్టి.. నేరుగా ప్రజల దగ్గరకే వెళ్లి వాళ్ల కష్టాలను వింటూ వాటిని పరిష్కరిస్తూ చివరకు తెలంగాణ రాష్ట్రానికి సీఎం అవుతాడు. ఈ మధ్యలో విజయ్ దేవ్ జీవితంలో జరిగిన సంఘటనలు ఏమిటి ? వాటిని విజయ్ దేవ్ ఎలా సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాడు ? అసలు విజయ్ దేవ్ ను కదిలించిన అంశాలు ఏమిటి ? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ:
పబ్లిక్ స్టార్‌ శ్రీకాంత్ తెలంగాణా ముఖ్యమంత్రి పాత్రలో అద్భుతంగా నటించాడు, జిషాన్ ఉస్మాన్ చిన్నప్పటి కేసీఆర్ గారి పాత్రలో ఒడిగిపోయాడు, మొదటి సినిమానే అయిన అనుభవం కలిగిన నటుడిగా బాగా నటించాడు, తనకు మంచి భవిషత్తు ఉంటుంది. శ్రీకాంత్ గారి సతీమణి పాత్రలో సంగీత నటన బాగుంది. బ్రహ్మానందం సునీల్, సుమన్, బ్రహ్మాజీ, వెంకట్, పృథ్వీ, రఘుబాబు, షాయాజి షిండే, విజయ్ రంగరాజు, బెనర్జీ, చిట్టిబాబు, మధుమిత, సత్యకృష్ణ, సన, రజిత, ఈటీవీ ప్రభాకర్, సమీర్, బస్ స్టాప్ కోటేశ్వరరావు, కాశీ విశ్వనాథ్, జెమిని సురేష్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

 
 నందన్ బొబ్బిలి సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణ. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా చేశారు.
సినిమాటోగ్రాఫర్ అడుసుమిల్లి విజయ్ కుమార్ కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ గ్రాండ్ గా ఉన్నాయి. గౌతంరాజు ఎడిటింగ్ ఎక్కడా బోరింగ్ లేకుండా షార్ట్ అండ్ స్వీట్ గా ఉంది. లైన్ ప్రొడ్యూసర్ మహ్మద్ ఖాన్ మేకింగ్ బాగుంది అలాగే ఈ తెలంగాణ దేవుడు సినిమాకు మూల కథ అందించడమే కాకుండా సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మాత మొహహ్మద్ జాకీర్ ఉస్మాన్ అద్భుతంగా సినిమాను నిర్మించారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. డైరెక్టర్ వడత్యా హరీష్ ఎంచుకున్న పాయింట్ కు పూర్తి న్యాయం చేశారు. సినిమా ఫ్లో మిస్ అవ్వకుండా ఆడియన్స్ కు ఎక్కడా బోరింగ్ ఫీల్ అవ్వకుండా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో తెలంగాణా దేవుడు సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా అతనికి మంచి పేరును తెచ్చుపెతుంది.

రేటింగ్: 3/5

Post a Comment

0 Comments