"కార్పొరేటర్" పాత్రలో అలరించడానికి మన ముందుకు వస్తున్న షకలక శంకర్

"కార్పొరేటర్" పాత్రలో అలరించడానికి మన ముందుకు వస్తున్న షకలక శంకర్ ,

" *కార్పొరేటర్" ట్రైలర్ ను విడుదల చేసిన చిత్ర యూనిట్* 

సమీప మూవీస్ మరియు యు & ఐ స్టూడియోస్ పతాకాలపై హాస్య నటుడు షకలక శంకర్ , సునీత పాండే, లావణ్య శర్మ, కస్తూరి హీరో,హీరోయిన్లు గా  సంజయ్ పూనూరి దర్సకత్వంలో ఎ. పద్మనాభిరెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'కార్పొరేటర్'. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చెసుకొని సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటున్న సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు "కార్పోరేటర్" ట్రైలర్ ను విడుదల చేశారు.ఈ సందర్భంగా

 *చిత్ర దర్శక,నిర్మాతలు మాట్లాడుతూ..* కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రంలో షకలక శంకర్ మరియు హీరోయిన్లు చాలా బాగా నటించారు. వినోదానికి పెద్ద పీట వేస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అంతర్లీనంగా ఒక మంచి సందేశం ఉంటుంది. ఇందులోని పాటలు, ఫైట్స్ సందర్భానుసారంగా వస్తాయి. ఈ సినిమాలో 5 పాటలు, 4 ఫైట్స్ ఉంటాయి. మా యూనిట్ సభ్యుల సమక్షంలో ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసినందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. 

 *నటీనటులు* 
షకలక శంకర్,  సునీత పాండే, లావణ్య శర్మ, కస్తూరి తదితరులు 

 *సాంకేతిక నిపుణులు* 
బ్యానర్ :-సమీప మూవీస్ , యు అండ్ ఐ స్టూడియోస్
నిర్మాత :-ఎ. పద్మనాభిరెడ్డి
దర్శకుడు :- సంజయ్ పూనూరి
సహ నిర్మాత :- డాక్టర్ యస్.వి. మాధురి
కెమెరా :- జగదీష్ కొమరి
సంగీతం :- ఎం.ఎల్.పి.రాజా
ఎడిటర్ :- శివ శర్వాణి
ఫైట్ మాస్టర్ :- విన్చున్ అంజి
పి.ఆర్.ఓ :- మధు వి.ఆర్

Post a Comment

0 Comments