నటుడు అనూప్ సింగ్ ఠాకూర్ సూర్య సింగం 3 మరియు అల్లు అర్జున్ నాపేరు సూర్య, సాయి ధరమ్ తేజ్ విన్నర్ తదితర చిత్రాల్లో నటించాడు. ఇటీవల అనూప్ తీవ్ర కడుపు నొప్పితో భాద పడుతుంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించడం జరిగింది. డాక్టర్స్ అతనికి అపెండిక్స్ వచ్చింది ఆపరేషన్ చెయ్యాలని చెప్పడంతో వెంటనే సర్జరీ చేయించుకున్నారు.
సర్జరీ అయిన వెంటనే రవితేజ ఖిలాడి సినిమా చిత్ర యూనిట్ నుండి పిలుపు వచ్చింది. తాను పూర్తి చెయ్యాల్సిన షూట్ ఇంకా మిగిలిఉండని వారు చెప్పడంతో అనూప్ వెంటనే హైదరాబాద్ వచ్చి షూటింగ్ లో పాల్గొన్నారు. డాక్టర్స్ రెస్ట్ తీసుకోమని చెప్పినా, ఇతర నటీనటులతో కాంబినేషన్ సీన్స్ ఉండడంతో డెడికేషన్ గా వచ్చి షూటింగ్ పూర్తి చేయడం జరిగింది. అనూప్ రవితేజ ఖిలాడి సినిమాలో డేవిడ్ పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం అనూప్ ఆరోగ్యంగా ఉన్నాడు.
0 Comments