హీరో కావాలనే కోరిక అందరికీ ఉంటుంది.. కానీ దానిని సాకారం చేసుకునే ఆలోచన కొందరికే ఉంటుంది. అందరికీ అది సాధ్యం కాదు.. దాని వెనుక ఎంతో కష్టం ఉంటుంది.. కృషి, పట్టుదల, దీక్ష ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చు అనటానికి ఇండస్ట్రీలో ఎంతోమంది స్ఫూర్తినిచ్చేవారు చాలా మంది ఉన్నారు. ఆకోవలోకి ఆర్యన్ గౌర బెస్ట్ ఎగ్జామ్ పుల్ గా చెప్పుకోవచ్చు. తాను ఒక సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ.. హీరో కావాలనే తనకలను 'జి-జాంబీ' చిత్రం ద్వారా నిజం చేసుకున్నాడు. తెలుగులో జాంబీస్ జోనర్ ని పరిచయం చేస్తూ.. ఆర్యన్ గౌర హీరోగా నటిస్తూ.. ఆర్యన్-దీపు దర్శకత్వం వహించిన చిత్రం "జి-జాంబీ". సాయి సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై దివ్య పాండే హీరోయిన్ గా సూర్య నిర్మించిన "జి-జాంబీ" చిత్రం ఫిబ్రవరి 5న గ్రాండ్ గా విడుదలై అద్భుతమైన ఓపెనింగ్స్ రాబట్టుకొని సూపర్ సక్సెస్ అయింది. అలాగే ఫిబ్రవరి 26న అమెజాన్ ప్రైమ్ లో "జి-జాంబీ" చిత్రం విడుదలై సూపర్ సక్సెస్ తో దిగ్విజయంగా ముందుకు దూసుకుపోతుంది. కాగా ఇటీవల ఈ చిత్రం గురించి తెలుసుకొని సోను సూద్ జి-జాంబీ రషెస్ వీక్షించి చిత్ర యూనిట్ ని అభినందించారు.
ఇండియన్ స్టార్ సోనూ సూద్ మాట్లాడుతూ.. ' హాలీవుడ్, బాలీవుడ్ లో జాంబీస్ జోనర్ లో కొన్ని మూవీస్ వచ్చాయి.. ఇప్పుడు తెలుగులో కూడా జి-జాంబీ చిత్రం రిలీజ్ అయి ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. ఆర్యన్, దీపు దర్శకత్వం వహించిన ఈ చిత్రం రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. హ్యూజ్ రెస్పాన్స్ తో వస్తుంది.. అభిమానులు, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసి ఇంకా పెద్ద హిట్ చెయ్యాలని కోరుకుంటున్నాను.. ఇలాంటి కొత్త టీమ్ ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయాలి.. అప్పుడే డిఫరెంట్ ఫిలిమ్స్ వారినుండి వస్తాయి. ఇంత మంచి సినిమాని తీసిన ఆర్యన్ గౌరని మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నాను.. అన్నారు.
మా జి-జాంబీ టీజర్, ట్రైలర్స్ చూసి.. కొంత రష్ సినిమా కూడా చూసి గ్రేట్ పర్సనాలిటీ, హ్యూమన్ బీయింగ్ సోను సూద్ గారు మమ్మల్ని అప్రిషియేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. కొత్త టీం అయిన మాకు ఆయన ఇచ్చిన ఎంకరేజ్ మెంట్, సపోర్ట్ జీవితంలో మర్చిపోలేను.. జి-జాంబీ చిత్రం నాకు చాలా మంచి పేరు తెచ్చింది. అమెజాన్ ప్రైమ్ లో 2021 ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో రిలీజ్ అయిన జి-జాంబీ పెద్ద హిట్ దిశగా దూసుకుపోతుంది. అమెజాన్ ప్రైమ్ లో మా సినిమా ఉంది. ఇంకా ఎవరైనా చూడకపోతే జి-జాంబీ చూసి ఆశీర్వదించాలని ప్రేక్షకులని కోరుతున్నాను. ఇదే ఉత్సాహం, స్పిరిట్ తో మరొక డిఫరెంట్ కథాంశంతో సినిమా చేయబోతున్నాను.. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది..మేలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్తుంది.. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాను.. అని హీరో ఆర్యన్ గౌర అన్నారు.
0 Comments