వృత్తిరీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ప్రవృత్తి రీత్యా పరియవరణ ప్రేమికులైన కార్తిక్ మరియు సుజిత్, వస్త్రవినియోగం వల్ల అర్పడే జల మరియు వాయు కాలుష్యనియంత్రణకు వారి వంతు సహయని అందించాలన్న ఆశయంతో స్థాపించిన సంస్థ Donate Vastra. పేదలకు, అనాధలకు, వృద్దులకు మరియు మురికవాడల్లోని వారికి వస్త్ర దానం చేయాలని ఆలోచన అల వారి మది సంద్రంలో కదిలింది.
వెంటనే 20ముఖ్య కేంద్రాలలో వస్త్ర స్వీకరణ ప్రారంభించారు. అనంతరం వాటిని శుభ్రపరిచి, ఉతికించి, ఇస్త్రీ చేసి దాదాపు 500జతల బట్టలను మొదటి విడతగా అందించారు.
ఇది మరింత విస్తరిస్తూ రెండవ విడత పంపిణీ కోసం దాదాపు 1000 జతల బట్టలను సిద్ధంగా ఉంచారు.
ఈ వస్త్ర పంపిణీ త్వరగా విస్తరించి నగరంలోని పలుచోట్ల Kapda ATMs నెలకొల్పాలి అని ఆశిస్తున్నారు వారి ఆశయము నెరవేరాలని ఆశిద్దాం.
0 Comments