గ్రీన్ క్రాస్ థియోసోఫికల్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ సమర్పణలో షబాబు ఫిలిమ్స్ బ్యానర్ పై షేక్ బాబు సాహెబ్ (బాబుషా) నిర్మాతగా భార్గవ గొట్టిముక్కల దర్శకత్వంలో రాబోతున్న సినిమా వధుకట్నం. ఇటీవల ఈ చిత్ర టైటిల్ లోగో ఆవిష్కరణ జరిగింది. డిఫరెంట్ టైటిల్ తో వస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
శ్రీహర్ష, ప్రియ శ్రీనివాస్, రఘు జి, కవిత శ్రీరంగం, ఆర్యన్ గౌర, జాన్ కుశల్, రేఖ ఇందుకూరి, అనోన్య పాణిగ్రాహి ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రభు ప్రవీణ్ లంక (నాని) సంగీతం అందించిన ఈ సినిమాకు ఎస్.డి.జాన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చక్కటి కుటుంభ కథతో పేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ త్వరలో రానుంది.
0 Comments