సినిమా: సైకిల్
నటీనటులు: మహాత్ రాఘవేంద్ర, పునర్నవి భూపాలం, శ్వేతా వర్మ, సుదర్శన్ తదితరులు
డైరెక్టర్: అట్ల అర్జున్ రెడ్డి
నిర్మాతలు: పి.రామ్, వి.బాలాజీ
సంగీతం: జి.ఎమ్.సతీష్
సమర్పణ: శ్రీహరి కొమ్మినేని
పునర్నవి భూపాలం ,మహత్ రాఘవేంద్ర ,శ్వేతావర్మ ,సూర్యభరత్ చంద్ర లీడ్ రోల్స్ లో , పి .రాంప్రసాద్ .వి బాలాజీరాజు ,నిర్మాణంలో ,ఆట్ల అర్జున్ రెడ్డి రచన -దర్శకత్వంలొ , తెరకెక్కించిన చిత్రం “సైకిల్ ” ఈ సినిమా అనూహ్యంగా సంక్రాంతి బరిలో జనవరి 15 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథ:
సుబ్రమణ్యం (మహాత్) జీవితంలో జరిగే ప్రతి సంఘటన శ్రీను జీవితంలో జరుగుతూ ఉంటుంది. ఇద్దరి జాతకాలు సరిగ్గా ఉండవు, వీరు ఏం చేసినా అది వీరికి వ్యతిరేకం అవుతుంది. ఒక జోతిష్యుడు వీరి జీవితంలోకి ఒక అమ్మాయి వస్తే వీరిద్దరి లైఫ్ బాగుంటుందని చెబుతాడు. ఈ క్రమంలో సుబ్రమణ్యంకు శాండీ పరిచయం అవుతుంది. కానీ వీరిద్దరూ విడిపోయారు. అనుకోని కారణాల వల్ల సుబ్రమణ్యంకు శిరీష (పునర్నవి) పరిచయం అవుతుంది. ఎలాగైనా వివాహం చేసుకోవడానికి శ్రీను, చరిత వెంట పడుతుంటాడు. సుబ్రమణ్యం - శిరీష జీవితంలో జరిగే అన్ని విషయాలు శ్రీను - చరిత జీవితంలో ఎందుకు జరుగుతుంది ? ఈ రెండు జంటలు చివరికి ఏమయ్యాయి ? వంటి విషయాలు తెలుసుకోవాలంటే సైకిల్ మూవీ చూడాల్సిందే.
విశ్లేషణ:
నూతన దర్శకుడైన అట్ల అర్జున్ రెడ్డి ఎంచుకున్న కథ, కథనాలు బాగున్నాయి. ఒక రొమాంటిక్ లవ్ స్టోరీని ఆయన తెరకెక్కించిన విధానం హైలెట్. కామెడీ, ట్విస్టులు, ఇంటర్వెల్ ఎపిసోడ్, పాత్రల డిజైనింగ్ ఇలా అన్నీ బాగా రాసుకున్నాడు. జీ.ఎమ్. సతీష్ అందించిన పాటలు బాగున్నాయి. మూడు డిఫరెంట్ సాంగ్స్ ఇచ్చాడు. నేపధ్య సంగీతం కూడా అద్భుతంగా ఉంది. నిర్మాతలు పి.రామ్, వి.బాలాజీ సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. సినిమా రిచ్ గా ఉంది, నిర్మాణ విలువలు బాగున్నాయి.
హీరో మహాత్ రాఘవేంద్ర హీరోయిన్ పునర్నవి భూపాలం బాగా నటించారు. ఏం జరుగుతుందోనన్న ఒక క్యూర్యాసిటీతో సాగే ఒక లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో వీరిద్దరూ బాగా నటించారు. వీరి ఫ్రెండ్స్ పాత్రల్లో సుదర్శన్, శ్వేతా వర్మ తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. పోలీసు స్టేషన్ లో జరిగే కొన్ని సన్నివేశాలు కామెడీగా బాగున్నాయి. సెకండ్ హాఫ్ లో వచ్చే రొమాంటిక్ సాంగ్ బాగుంది. సినిమాటోగ్రఫి బాగుంది.
యువతను మెప్పించడానికి తీసిన సైకిల్ సినిమా సంక్రాంతి బరిలోకి సైలెంట్ గా వచ్చి యువతను అలరిస్తుంది. సరదాగా సాగే ఈ సినిమాను తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు. సైలెంట్ గా సంక్రాంతికి విడుదలైన సైకిల్ సినిమా అందరిని అలరిస్తుంది.
రేటింగ్: 3.5/5
చివరిగా: 'సైకిల్' అందరిని అలరిస్తుంది.
4 Comments
This comment has been removed by the author.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteహీరో మహాత్ రాఘవేంద్ర హీరోయిన్ పునర్నవి చాల బాగా నటించారు. కామెడీ, స్టోరీ, నటన పరంగా ఈ సినిమా చాలా బాగుంది. ఫామిలీ తో కలిసి చూడదగ్గ చక్కని సినిమా "సైకిల్ "
ReplyDeleteహీరో మహాత్ రాఘవేంద్ర హీరోయిన్ పునర్నవి చాల బాగా నటించారు. కామెడీ, స్టోరీ, నటన పరంగా ఈ సినిమా చాలా బాగుంది. ఫామిలీ తో కలిసి చూడదగ్గ చక్కని సినిమా "సైకిల్ "
ReplyDelete