రివ్యూ: తెరవెనుక

రివ్యూ: తెరవెనుక

నటీనటులు:
అమన్, విశాఖ ధిమాన్, దీపిక రెడ్డి హీరోయిన్ లుగా, ఆనంద చక్రపాణి , నిట్టల శ్రీరామమూర్తి , టి.ఎన్.ఆర్ ,శ్వేత వర్మ , సంపత్ రెడ్డి తదితరులు.

సాంకేతిక నిపుణులు:
కథ, మాటలు - బాబా 
కెమెరా - రాము కంద, 
ఎడిటర్ - బొంతల నాగేశ్వరరెడ్డి
మ్యూజిక్ - రఘురామ్  
ఫైట్స్ - సూపర్ ఆనంద్
డాన్స్- కపిల్, శిరీష్ , అనీష్ 
లిరిక్స్- కాసర్ల శ్యామ్, సురేష్ బనిశెట్టి , బండి సత్యం రఘురామ్
పిఆరోఒ - మధు వి.ఆర్

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ హీరోగా పరిచయమౌతున్న చిత్రం తెరవెనుక. ఈ చిత్రం ట్రైలర్స్ టీజర్స్ తో ఆకట్టుకున్నారు. వెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్సకత్వంలో విజయ లక్ష్మి మురళి మచ్చ నిర్మించిన ఈ చిత్రం నూతన సంవత్సర శుభాకాంక్షలతో జనవరి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. పబ్లిసిటీతో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథ:

సంజయ్ (అమన్) తన లవర్ అంజలి (విశాఖ) తో సరదాగా లైఫ్ గడుపుతుంటాడు. అంజలి తన ప్రేమ వ్యవహారం ఇంట్లో చెప్పదు. కానీ తండ్రికి మాత్రం తెలుస్తుంది. వీరిద్దరు కలిసి ఉన్న రొమాంటిక్ వీడియోలు ఓ గ్యాంగ్ అంజలికి పంపి బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెడుతుంది ఓ గ్యాంగ్. పది లక్షలు ఇస్తేనే పెన్ డ్రైవ్ ఇస్తా అని బెదిరిస్తారు. పది లక్షలు ఇస్తారు. కానీ వీడియో ఇవ్వరు. ఆ తర్వాత మరో పది లక్షలు డిమాండ్ చేస్తారు. ఆ తర్వాత పెన్ డ్రైవ్ ఇస్తారు. కానీ ఇంతలోనే అనుకోని ట్విస్టులు టర్నులు జరుగుతాయి. ఈ గ్యాంగ్ ను పట్టుకునేందుకు పోసీస్ ఆఫీసర్ శ్వేతా వర్మ ప్రయత్నిస్తుంది. అసలు ఆ పెన్ డ్రైవ్ లో ఏముంది. హీరో అమన్ ఎలాంటి స్టెప్ తీసుకున్నాడు. పోలీస్ ఆఫీసర్ బ్లాక్ మెయిలింగ్ గ్యాంగ్ ని పట్టుకుందా లేదా అన్నది అసలు కథ.

విశ్లేషణ:
సినిమా ప్రారంభం నుంచే కథలో లీనమయ్యేలా స్క్రీన్ ప్లే తీర్చిదిద్దాడు దర్శకుడు. హీరో అమన్ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. రెండు వేరియేషన్స్ ని బాగా ప్లే చేయగలిగాడు. ఫస్ట్ సినిమా అయినా దర్శకుడి సలహాలతో బాగా నటించాడు. చూడటానికి హ్యాండ్ సమ్ ఉన్నాడు. అమన్ క్యారెక్టర్ కు సరిగ్గా సరిపోయాడు. ఇక హీరోయిన్ రొమాంటిక్ గా కనిపిస్తూనే మంచి పెర్ ఫార్మెన్స్ చూపించగలిగింది. ఎమోషనల్ సీన్స్ లోనూ బాగా చేసింది.

క్రైమ్ థ్రిల్లర్ సోషల్ కాజ్ గా ఈ సినిమా తెరకెక్కించారు. అన్ని అంశాల్ని మేళవించి ఈసినిమా తెరకెక్కించారు. హీరో హీరోయిన్స్ మధ్య లవ్ ఎపిసోడ్స్ ని బాగా తెరకెక్కించారు. వీరిద్దరి మధ్య వచ్చే రెండు సాంగ్స్ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి. మంచి రొమాంటిక్ యాంగిల్ ని ప్రెజెంట్ చేశారు. వీరిద్దరి మధ్య లప్ కిస్ సీన్స్ ని కూడా డీసెంట్ గా పిక్చరైజ్ చేశారు. ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో ఇప్పుడున్న సిచువేషన్ లో ఆడవాళ్ళ పై జరుగుతున్న అరాచకాల్ని దర్శకుడు ప్రవీణ్ బాగా ఎస్టాబ్లిష్ చేశారు. పోలీస్ వ్యవస్థ గొప్పతనాన్ని పోలీస్ ఆఫీసర్ తో పవర్ ఫుల్ గా చెప్పించారు. షీ టీమ్స్ పనితనాన్ని బాగా చూపించారు. స్వీయ రక్షణ ఎంత ఇంపార్టెంట్ అనే విషయాన్ని దర్శకుడు ఓ సీన్ లో బాగా చెప్పించారు. క్రైమ్ థ్రిల్లర్స్ ఎన్ని వచ్చినా… మంచి మెసేజ్ ని ఇస్తూ థ్రిల్ చేయగలిగారు. ఎవ్వరూ ఎక్స్ పెక్ట్ చేయని ట్విస్టులు చాలా ఉన్నాయి. ముఖ్యంగా హీరో పాయింట్ ఆఫ్ వ్యూని దర్శకుడు సర్ ప్రైజ్ చేయగలిగాడు. స్క్రీన్ ప్లే పరంగా దర్శకుడు చాలా సక్సెస్స అయ్యాడనే చెప్పాలి. శ్వేతా వర్మ ఈ సినిమా కోసం బాగా కష్టపడింది. డిజిపీ పాత్రలో సరిగ్గా సరిపోయింది. యాక్షన్ సీక్వెన్స్ లో బాగా మెప్పించింది. క్లైమాక్స్ ఫైట్ ని చాలా బాగా కంపోజ్ చేశారు. స్టైలిష్ మేకింగ్ చేశారు. పోలీస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారో సరిగ్గా చూపించారు. దీపిక రెడ్డి తో పాటు విలన్ బ్యాచ్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఓ ఐటమ్ సాంగ్ తో పాటు సినిమాలో అన్ని పాటలకు ఇంపార్టెన్స్ ఉంది. టెక్నికల్ గా రఘురాం మంచి పాటలతో పాటు నేపథ్య సంగీతం చాలా బాగా ఇచ్చాడు. అలాగే రాము కంద కెమెరా వర్క్ చాలా బాగుంది. ముఖ్యంగా పాటల్లో స్పెషాలిటీ కనిపించింది. సూపర్ ఆనంద్ ఫైట్స్ బాగున్నాయి.

నిర్మాత విజయ లక్ష్మి మురళి మచ్చ ఖర్చుకు వెనకాడకుండా కంటెంట్ కు తగ్గట్టుగా ఈ సినిమా నిర్మిచారనిపించింది. మంచి టేస్ట్ ఉన్న నిర్మాతగా ఈ సినిమా నిర్మించారనిపించింది. కేవలం కమర్షియల్ యాంగిల్ మాత్రమే కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా… చాలా మందికి ఇనిస్పిరేషన్ కలిగించేలా సినిమా నిర్మించారు. దర్శకుడు సైతం నిర్మాతల అభిరుచికి తగ్గట్టుగా బాబా అందించిన ఈ కథను సినిమాగా మలిచారు. ముఖ్యంగా పెన్ డ్రైవ్ ను వెతికే క్రమంలో వచ్చే ట్విస్టులు సినిమాకు హైలైట్ గా ఉన్నాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ సర్ ప్రైజింగ్ ఉంది. సెకండాఫ్ లో ఆద్యంతం ఆసక్తిరేకెత్తించే సన్నివేశాల్ని అల్లుకున్నారు. టెక్నికల్ గా గ్రాఫిక్స్ ని ఇంకా బాగా వాడి ఉంటే బాగుండేది అనిపించింది. నేటి యూత్ ముఖ్యంగా అమ్మాయిలు తప్పకుండా చూడాల్సిన సినిమా తెరవెనక. సో గో అండ్ వాచిట్.

రేటింగ్: 3.5/5

Post a Comment

0 Comments