2 స్టేట్స్ రీమేక్ షూటింగ్ పూర్తి చెయ్యనందున లీగల్ సమస్యలో చిక్కుకున్న అడవిశేష్ !

2 స్టేట్స్ రీమేక్ షూటింగ్ పూర్తి చెయ్యనందున లీగల్ సమస్యలో చిక్కుకున్న అడవిశేష్ !

బాలీవుడ్ చిత్రం, 2 స్టేట్స్ యొక్క తెలుగు రీమేక్ లో యువ హీరో అడివి శేష్ కథానాయకుడిగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. పెద్దగా మార్పులు లేకుండా రీమేక్ ఒరిజినల్ మాదిరిగానే ఉండేలా స్క్రిప్ట్ రెడీ చేసుకొని అడివి శేష్ మరియు శివానీ రాజశేఖర్ లతో కొంతకాలం షూటింగ్ కూడా చేశారు. అయితే అనుకోకుండా కొన్ని కారణాల వల్ల సగం దశలోనే ఈ ప్రాజెక్ట్ అకస్మాత్తుగా ఆగిపోయింది.

అప్పటి నుండి ఆ ప్రాజెక్ట్ పై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక లేటెస్ట్ గా అందిన వార్త ఏమిటంటే, ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్న ఎంఎల్‌వి సత్యనారాయణ కథానాయకుడిపై శేష్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. ఎందుకంటే.. ఈ చిత్రం పూర్తి చేయడానికి హీరో సహకరీంచడం లేదని, సడన్ గా తప్పుకొని అగ్రిమెంట్ ను ఫాలో కాలేదని సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రెండోది ఒప్పందాన్ని గౌరవించడం లేదని, బదులుగా ఇతర ప్రాజెక్టులతో ముందుకు సాగడం వల్ల నిర్మాతలకు భారీగా నష్టం వాటిల్లుతుందని పిటిషన్ లో పేర్కొన్నారు. ఒప్పందాన్ని లెక్క చేయనందుకు గాను అడివి శేష్‌పై చర్యలు తీసుకోవాలని నిర్మాత కోర్టును కోరారు. అయితే ఈ కేసుపై ఇంకా అడివి శేష్ ఇంకా స్పందించలేదు.

Post a Comment

0 Comments