అద్భుతమైన నటి కీర్తి సురేష్ నటిగా సినిమా సినిమాకి తనను తానూ ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ ముందుకుపోతోంది. ‘మిస్ ఇండియా’లో తన పాత్రలో ఆమె ఒదిగిపోయింది. ఆమె కొన్ని సన్నివేశాల్లో కొత్తగా కనిపిస్తోంది. ఈ సినిమాలో కీర్తికి తల్లిగా నదియా, తండ్రిగా సీనియర్ నరేష్, అన్నగా కమల్ కామరాజు బాగా నటించారు.
రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేకపాత్ర అయిన తాతయ్య పాత్రలో నటించి మెప్పించారు. అలాగే నవీన్ చంద్ర, జగపతిబాబులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక బిజినెస్ చేయాలనుకునే అమ్మాయికి తన ఇంట్లో నుంచే వ్యతిరేకత మొదలవడం.. అన్నిటినీ ఎదిరించి ఒక అమ్మాయి వ్యాపారంలోకి అడుగుపెట్టి సక్సెస్ కావడం లాంటి కొన్ని సీన్స్ బాగున్నాయి. ఛాయ్ బిజినెస్‌ను ప్రారంభించిన కీర్తి ప్రత్యర్థిగా స్టైలిష్ బిజినెస్‌మెన్ జగపతిబాబును ఎలా ఓడించింది అనేది బాగుంది.
డైరెక్టర్ నరేంద్రనాథ్ నూతన దర్శకుడైనా అనుభవం కలిగిన దర్శకుడిగా సినిమాను తీశారు. తను ఎంచుకున్న కథ, కథనాలు అద్భుతంగా తెరకెక్కించాడు. దర్శకుడు నరేంద్రనాథ్ తో రచయిత తరుణ్ పదునైన మాటలు రాశారు. నిర్మాత మహేష్ కోనేరు ఖర్చుకు ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. కుటుంభ విలువలు కిలిగిన ఈ సినిమాను అందరూ చూడవచ్చు.
0 Comments