(or)
వామ్మో... స్వాతి దీక్షిత్ అభిమానులు అంత పని చేశారా..?
(or)
స్వాతి దీక్షిత్ కోసం ధర్నాలు చేస్తున్న అభిమానులు!
తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 లో మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి , కేవలం పది రోజులకే బిగ్ బాస్ హౌస్ కి గుడ్ బై చెప్పి బయటకి వచ్చేసింది స్వాతి దీక్షిత్. బుట్టబొమ్మ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన అందం, స్పిరిట్ తో అందరిని ఆకట్టుకొని ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తొలివారమే నామినేషన్స్ లోకి రావడం , ఎలిమినేట్ అయ్యి బయటకి రావడం అంతా ఊహించని విధంగా జరిగిపోయింది. అయితే , ఆమెకి ఓట్లు రాలేదు కాబట్టే బిగ్ బాస్ నిర్వాహకులు బయటకి పంపేశారు అని చెబుతున్నా దీని వెనుక ఏదో అంతుచిక్కని రహస్యం దాగి ఉందనే అనుమానాలు నెటిజన్ల నుంచి వ్యక్తమవుతున్నాయి.
అసలు స్వాతి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత రోజు నుండే ఆమెకి స్క్రీన్ స్పేస్ ఇవ్వడం తగ్గించేశారు. షో మొత్తం ఒక గంట టెలికాస్ట్ అయితే కేవలం ఒకటి , రెండు సార్లు మాత్రమే స్వాతి దీక్షిత్ ముఖం చూపించేవారు. దీంతో హౌస్ లో స్వాతి ఏమి చేయలేదు అని భావించి అభిమానులు కూడా ఓట్లు వెయ్యలేదేమో అని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఎలిమినేట్ అయ్యి బయటకి వచ్చిన స్వాతి పలు ఇంటర్వూస్ లో మాట్లాడుతూ ..నేను హౌస్ లో చాలా చేశానని కానీ వాటిని అభిమానులకి చూపించలేదని ఫీల్ అయింది.
అలాగే స్వాతి హౌస్ నుండి బయటకి వచ్చే సమయంలో నోయల్ ఏడుస్తూ కనిపించాడు. అలాగే స్టేజ్ పై నుండి స్వాతి మాట్లాడిన సందర్భంలో కూడా నోయల్ చాలా ఎమోషనల్ అయ్యాడు. అసలు వీరిద్దరి మధ్య ఆ బాండింగ్ ఎలా కుదిరింది అన్నది కూడా బిగ్ బాస్ చూపించలేదు. ఇక దివితో చాలా క్లోజ్ అయ్యాను అని స్వాతి చెబుతోంది. అలాగే దివి ఈజ్ బెస్ట్ అంటూ నాగార్జున ముందే చెప్పింది.అయితే , వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలు కూడా టెలీకాస్ట్ చేయలేదు.
మొత్తంగా స్వాతికి స్క్రీన్ స్పేస్ ఇవ్వకపోవడం వల్లే ఎలిమినేట్ అయింది. స్వాతి తనకున్న టాలెంట్ ఏంటో హౌస్ లో చూపించింది అలాగే స్వాతి తెలుగు లో కూడా బాగా మాట్లడగలదు. అన్యాయంగా తనను ఎలిమినేట్ చేయడంపై స్వతి బాధ పడుతోంది. ఇక స్వాతిని అనవసరంగా ఎలిమినేట్ చేసారని , ఆమెని మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి పంపించాలని స్వాతి మద్దతుదారులు , అభిమానులు బిగ్ బాస్ హౌస్ ముందు ధర్నాకి దిగారు. స్వాతి విషయంలో బిగ్ బాస్ ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటారో లేదో చూడాల్సి ఉంది.
0 Comments