స్వాతి దీక్షిత్'కు యోగా అంటే ఎంత ఇష్టమో తెలుసా ?

'స్వాతి దీక్షిత్'కు యోగా అంటే ఎంత ఇష్టమో తెలుసా ?
స్వాతి దీక్షిత్ అందానికి కారణం యోగానేనా ?

స్వాతిదీక్షిత్ కి యోగాకి మధ్య ఉన్న సంబంధం ఏమిటంటే? 

స్వాతి దీక్షిత్ .. చూపు తిప్పుకోనివ్వని అందం, మత్తెక్కించే కళ్లతో  బిగ్ బాస్ హౌస్ లోకి మూడో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బుట్టబొమ్మ  స్వాతి దీక్షిత్ గురించే ఇప్పుడు చర్చించుకుంటున్నారు. స్వాతి దీక్షిత్ బిగ్ బాస్ షోకే గ్లామర్ తెచ్చిందని, ఆమె రాకతో బిగ్ బాస్ హౌస్ లో గ్లామర్ డోస్ మరికొంచెం పెరిగిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. క్యూట్ గా, సాఫ్ట్ గా కనిపించే హౌస్ లోని ఇతర లేడీ కంటెస్టెంట్స్ కి టార్గెట్ గా మారి, వారికీ నిద్ర కూడా రాకుండా చేస్తుంది.  అందం, అభినయం ఉన్న స్వాతి కథలో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటించి తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నవిషయం తెలిసిందే.

ఇక స్వాతి దీక్షిత్  హౌస్ లోకి వచ్చిన మొదటి రోజే హౌస్ మెట్స్ అందరూ ఫ్లాట్ అయిపోయారు. ఆమె అందానికి బిగ్ బాస్ అభిమానులు కూడా ఫిదా అయ్యారు. ఏకంగా హోస్ట్ నాగార్జున సైతం ఈ బుట్టబొమ్మ అందం గురించి కామెంట్స్ చేయడం విశేషం. ముఖ్యంగా స్వాతి నువ్వు మేకప్ వేసుకోకపోయినా కూడా చాలా అందంగా ఉన్నావు అంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చేసారు. అయితే , స్వాతి అంత ఫిట్ గా ఉండటానికి , అందంగా కనిపించడానికి ముఖ్య కారణం మరొకటి ఉంది. 

స్వాతిదీక్షిత్ .. యోగా బాగా నేర్చుకుంది. అలాగే మరికొంతమందికి కూడా యోగాలో మేలుకవులు నేర్పిస్తుంది. ఆమె అందానికి , అభినయానికి ఇదే అసలైన సీక్రెట్. స్వాతి ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ కూడా .. దేశవ్యాప్తంగా పలు యోగా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ రోజుల్లోనే నామినేట్ చేసినా కూడా అసలు ఏ మాత్రం తనకి సంబంధం లేదు అన్నట్టుగా స్వాతి ప్రవర్తించడానికి యోగా కూడా ఒక కారణమే. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి ఉదయాన్నే హౌస్ మెట్స్ కి ఆరోగ్యం పై అవగాహనా కల్పిస్తూ .. వారితో కూడా యోగా చేపిస్తుంది. అయితే , బిగ్ బాస్ మనకి ఆ సీన్స్ ను చూపించడంలేదు. యోగా చేస్తుంది కాబట్టే రోజులు పెరుగుతున్నా కూడా అందం కూడా పెరుగుతూనే ఉంది. ఏదేమైనా స్వాతి అంత ఫిట్ గా  ఉండటానికి కారణం మాత్రం యోగానే అని చెప్పవచ్చు.

Post a Comment

0 Comments