బిగ్ బాస్ స్వాతి దీక్షిత్ తెలుగమ్మాయే అని మీకు తెలుసా..?
చూపు తిప్పుకోనివ్వని అందం, మత్తెక్కించే కళ్లు ఉన్న స్వాతి దీక్షిత్ బిగ్ బాస్ హౌస్ లోకి మూడో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. చాలామంది స్వాతి దీక్షిత్ బెంగాలీ అమ్మాయి అని అనుకుంటున్నారు. కానీ స్వాతి తెలుగమ్మాయే. గ్లామర్ డాల్ లా కనిపించే ఈ బిగ్ బాస్ బ్యూటీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను తెలుగు అమ్మాయినేనని వెల్లడించింది. చిన్న వయస్సులోనే సినిమాల్లో అడుగుపెట్టిన స్వాతి దీక్షిత్ కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుని విజయాలను అందుకుంది.
తెలుగులో చాలామంది హీరోయిన్లు షూటింగ్ కు వెళ్లామా...? పారితోషికం తీసుకున్నామా...? అనేలా ఉంటారు. కానీ స్వాతి దీక్షిత్ మాత్రం చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా ప్రమోషన్లలో పాల్గొంటూ సినిమా హిట్ కావడానికి తన వంతు కష్టపడతారు. స్వాతితో సినిమాలు డైరెక్టర్లు ఆమె క్రమశిక్షణ ఉన్న నటి చెబుతున్నారు. చాలామంది తనను నార్త్ ఇండియన్ అని అనుకుంటారని.. కానీ తాను అచ్చమైన తెలుగు అమ్మాయినేనని స్వాతి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
చాలామంది తెలుగు హీరోయిన్లైనా తెలుగు మాట్లాడటానికి ఇష్టపడరు. కానీ స్వాతి మాత్రం తాను తెలుగు అమ్మాయినేనని గర్వంగా చెప్పుకోవడంతో పాటు తెలుగు స్పష్టంగా మాట్లాడతారు. ఎప్పుడూ నవ్వుతూ క్యూట్ గా కనిపించే స్వాతి దీక్షిత్ ఎలాంటి సందర్భంలోనైనా పాజిటివ్ గా ఆలోచిస్తారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. బిగ్ బాస్ లో ఇతర కంటెస్టెంట్లకు గట్టి పోటీ ఇస్తున్న స్వాతి దీక్షిత్ సీజన్ 4 విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
0 Comments