టాలీవుడ్ సెలబ్రిటీలు నగరంలో తలుక్కుమన్నరు. మహిళల కోసం ప్రత్యేకంగా కాకతీయ ఫ్యాబ్రిక్స్ *19టీన్* ఉమెన్స్ బ్రాండ్ ప్రారంభ వేడుక ఇందుకు వేదికయ్యింది.
బేగంపేట లోని ఐ.టి.సి కాకతీయ లో జరిగిన కార్యక్రమంలో బాలివుడ్ నటి, ఇస్మర్ట్ శంకర్ ఫేమ్ నిధి అగర్వాల్, దక్షిణాది తార పూర్ణ, నటులు పునర్ణవి ప్రముఖ గాయని సునీత తో పాటు అనంతపురం జిల్లా సింగనమల తెదేపా ఇంచార్జీ బండారు శ్రావణి తెరాస అధికార ప్రతినిధి అనూష రామ్ ఉప్పలపాటి లు కలిసి ఈ *19 టీన్*- ఫర్ ఎవర్ టీన్ బ్రాండ్ నీ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నిధి అగర్వాల్ మాట్లాడుతూ మహిళా లోకానికి తమ అభిరుచికి అనుగుణంగా కాకతీయ ప్యాబ్రిక్స్ నుండి *19టీన్* ను ఆరంబించడం అభినందనీయం అని వారు అన్నారు.
సంస్థ డైరెక్టర్ అవిర్నేని శ్రీకాంత్ మాట్లాడుతూ వస్త్ర వ్యాపార ప్రపంచంలో అనతి కాలం లోనే వినియోగదారుల అభిమానాన్ని చూరగొన్న *లెనిన్ హౌస్* నిర్వహణలో కాకతీయ ఫ్యాబ్రిక్స్ ఆధ్వర్యంలో మహిళల కోసం ఈ సరికొత్త బ్రాండ్ ను మార్కెట్లోకి పరిచయం చేసింది అన్నారు. ఈనెల 25వ తేదీన హన్మకొండ లో ఎక్సక్లూజివ్ ఉమెన్స్ వేర్ తొలి షోరూం ను ప్రారంభించడం తోపాటు ఉత్తర భారత దేశం, దక్షిణ భారతదేశంలో యాభైకి పైగా షోరూంలను ఏర్పాటు చేయనుందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో డైరక్టర్ తిరుపతిరావు,పలువురు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
For more details please contact Ample Reach PR - 95429 76567
0 Comments