స్వాతి దీక్షిత్ కు భారీగా పోల్ అవుతున్న ఓట్లు... విన్నర్ ఆమేనా..?

స్వాతి దీక్షిత్ కు భారీగా పోల్ అవుతున్న ఓట్లు... విన్నర్ ఆమేనా..? 
బిగ్ బాస్ హౌస్ లోకి మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అడుగుపెట్టింది స్వాతి దీక్షిత్. స్వాతి దీక్షిత్ ఎంట్రీ బిగ్ బాస్ షోకు చాలా ప్లస్ అయింది. స్వాతి ఎంట్రీ తరువాత బిగ్ బాస్ చూసే ప్రేక్షకుల సంఖ్య భారీగా పెరిగినట్టు తెలుస్తోంది. తెలుగులో జంప్ జిలానీ, చిత్రాంగద సినిమాలతో మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్న ఈ గ్లామర్ బ్యూటీ తక్కువ సినిమాల్లోనే నటించినా రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది. 
 
ఇకపోతే నిన్నటి నామినేషన్ ప్రక్రియలో అమ్మ రాజశేఖర్ మాస్టర్ స్వాతిని నామినేట్ చేశారు. ఆమెపై అమ్మ రాజశేఖర్ మాస్టర్ లేనిపోని ఆరోపణలు చేసి ఆమెను నామినేట్ చేయడం. స్వాతి బిగ్ బాస్ హౌస్ లో అందరితో కలివిడిగా ఉంటున్నా ఎవరితోనూ ఎక్కువ కాంటాక్ట్ కావడం లేదని నిందలు వేశారు. ఏ తప్పు చేయకపోయినా అనవసరమైన నిందలు మోపి నామినేట్ చేయడంపై స్వాతి కొంచెం ఫీల్ అయింది. హౌస్ లోకి అడుగు పెట్టిన రెండు రోజులకే స్వాతిని నామినేట్ చేయడంపై బిగ్ బాస్ ప్రేమికుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 
 
అయితే స్వాతి నామినేషన్ లోకి వచ్చిందని తెలిసి ఆమె అభిమానులు నిన్న నైట్ నుండే ఆమెకు ఫోన్ లైన్ల ద్వారా ఓట్లు వేస్తున్నారని తెలుస్తోంది. అనధికారికంగా చేస్తున్న సర్వేలో స్వాతికి అనుకూలంగానే ఓట్లు పోల్ అవుతున్నాయి. గంగవ్వ నామినేట్ అయిన సమయంలో బిగ్ బాస్ ప్రేమికుల నుంచి ఏ స్థాయిలో రెస్పాన్స్ వచ్చిందో ఇప్పుడు అంతకు మించి రెస్పాన్స్ వస్తోందని తెలుస్తోంది. ఇకపోతే ఈ వారం మెహబూబ్, కుమార్ సాయిలలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. గతంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా వచ్చిన వాళ్లు విన్ కాలేకపోయినా స్వాతి దీక్షిత్ బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ గా నిలిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

Post a Comment

0 Comments