బిగ్ బాస్ హౌస్ లోకి మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా స్వాతి దీక్షిత్ అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. గ్లామర్ డాల్ గా కనిపిస్తున్న స్వాతి ఎంట్రీతో బిగ్ బాస్ ఫిమేల్ కంటెస్టెంట్లకు టెన్షన్ పట్టుకుందనే చెప్పాలి. మొన్నటివరకు బిగ్ బాస్ హౌస్ లో మోనాల్ కు మిగతా వాళ్లతో పోలిస్తే ఎక్కువ క్రేజ్ ఉండేది. అయితే స్వాతి రాకతో మోనాల్ ఫ్యాన్స్ సైతం స్వాతి వైపుకు షిఫ్ట్ అవుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
జంప్ జిలానీ, చిత్రాంగద సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న స్వాతి దీక్షిత్ యోగా ట్రైనర్ కూడా కావడం గమనార్హం. చూడచక్కనైన మోము, నవ్వుతూ కనిపించే వ్యక్తిత్వం స్వాతిని ప్రేక్షకులకు దగ్గర చేస్తున్నాయి. స్వాతి రాకతో బిగ్ బాస్ హౌస్ లో కొత్త లవ్ ట్రాకులు మొదలయ్యే అవకాశం కూడా ఉంది. ఆఖరికి బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన లాస్య సైతం స్వాతి దీక్షిత్ ముందుగానే ఎవరితో స్నేహం చేయాలో డిసైడ్ చేసుకుని వచ్చిందని చేసిన కామెంట్ స్వాతి ఎంట్రీతో లాస్య పడుతున్న భయానికి అద్దం పడుతోంది.
క్యూట్ గా కనిపించే స్వాతి దీక్షిత్ ఎంట్రీతో మోనాల్ కు డేంజర్ బెల్స్ మోగినట్టే అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బిగ్ బాస్ సీజన్ 4 వైల్డ్ కార్డ్ ఎంట్రీలలో స్వాతి ఎంట్రీనే నెటిజన్లను సైతం ఆకట్టుకుంటోంది. అవకాశాలు బాగానే వస్తున్నా స్వాతి అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుని తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్వాతి దీక్షిత్ టైటిల్ రేసులో ఉండటం ఖాయమని.. విన్నర్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.
0 Comments