హైదరాబాద్ లో పుట్టిన స్వాతి దీక్షిత్ బిగ్ బాస్ తెలుగు 4 లో స్పెషల్ ఎంట్రీ ద్వారా ప్రేక్షకులను అలరించబోతోంది. ఈ షో ద్వారా మరింతమంది తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వడం సంతోషమని స్వాతి దీక్షిత్ తెలుపుతోంది.
స్వాతి దీక్షిత్ తెలుగు అమ్మాయి అవ్వడంతో చక్కగా తెలుగు మాట్లాడుతుంది. బిగ్ బాస్ లోని ఇతర పాటిస్పెన్స్ తో తను సరదాగా గడుపుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ తన ట్యాలెంట్ ను ప్రదర్శిస్తుంది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...
తెలుగు బిగ్ లో అడుగు పెట్టడం సంతోషంగా ఉంది. గత ఏడాది నేను బిగ్ బాస్ హౌస్ లోకి రావాలి కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కుదరలేదు. కానీ నాకు ఇప్పుడు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. పేక్షకులకు వినోదాన్ని పంచడానికి ఇది సరైన అవకాశంగా భావిస్తున్నాను. నాకు మీ అందరి అభిమానం ఆశీస్సులు కావాలని తెలిపారు.
స్వాతి దీక్షిత్ తెలుగు, తమిళం, బెంగాలీ చిత్రాల్లో నటించారు. ‘నామ్’, ‘లేడీస్ అండ్ జెంటిల్మెన్’, ‘సింబా’ సినిమాలు స్వాతి దీక్షిత్‌కు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ‘జంప్ జిలానీ’ సినిమాలోనూ స్వాతి దీక్షిత్ హీరోయిన్గా నటించింది. 2009 లో 'అందమైన భామలు' అనే టెలివిజన్ షో టైటిల్ విన్నర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె ప్రస్తుతం వెబ్ సిరీస్ చేస్తూ ప్రజాదరణ పొందుతోంది. స్వాతి దీక్షిత్ పేరెంట్స్ హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు.
0 Comments